జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చేస్తోంది ! ఇంకా వీర్రాజు ఏమంటున్నారంటే ? 

బిజెపి ఘోరంగా ఓటమి చెందడంపై ఆ పార్టీ వైసీపీ ప్రభుత్వం పైన నిందలు వేస్తోంది.

టిడిపి , జనసేన పరోక్షంగా బీజేపీకి సహకరించినా, బిజెపి అభ్యర్థి ఓటమి చెందడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తనదైన శైలిలో స్పందించారు.

ఆ నియోజకవర్గంలో వైసిపి అధికారికంగా గెలిచినా, బిజెపి నైతికంగా విజయం సాధించిందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.ఈ నియోజకవర్గంలో వైసీపీ రిగ్గింగ్ పాల్పడిందని దాదాపు 40 వేల ఓట్లను రిగ్గింగ్ చేశారని, తాము మాత్రం పాంప్లెట్ ఇచ్చి ఓట్లు అడిగామని వీర్రాజు రాజమండ్రిలో వ్యాఖ్యానించారు.

వైసిపి ఈ నియోజకవర్గంలో గెలిచేందుకు ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చిందని, కానీ బద్వేల్ లో తాము ధర్మ పోరాటం చేశామని, వైసిపి అధర్మ యుద్ధం చేసిందని వీర్రాజు విమర్శించారు.గతంతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత ఎక్కువగా కనిపించింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ సొంత జిల్లాలో ఓట్లను కొనుక్కునే దుస్థితికి వచ్చారని విమర్శించారు.అసలు బద్వేల్ ఉప ఎన్నికల వరకు వైసీపీకి ప్రత్యేక హోదా అంశం గుర్తుకురాలేదా అంటూ వీర్రాజు ప్రశ్నించారు.

Advertisement

అసలు ఓట్లను వైసీపీ ఎందుకు కొనుక్కోవలసి వచ్చిందో చెప్పాలని వీర్రాజు నిలదీశారు.రాబోయే రోజుల్లో ఏపీలోనూ బీజేపీ కి సానుకూల ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జనసేన అంశాన్ని ఆయన ప్రస్తావించారు.

రాబోయే ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని, ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా అధికారంలోకి రావడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమ రెండు పార్టీలు అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని ఆయన వ్యాఖ్యానించారు.ఏపీలో బీజేపీ ఖచ్చితంగా బలం పుంజుకుంటుందని వీర్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించారు.

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దని తాము కేంద్రాన్ని కోరుతున్నామని వివరించారు.జనసేన, బీజేపీ పొత్తు రద్దు కాబోతోందని ప్రచారం ఉదృతం అవుతున్న సమయంలో తమ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లడం తో పాటు , అధికారాన్ని దక్కించుకోడం ఖాయం అని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!
Advertisement

తాజా వార్తలు