బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పుకు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయమై జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమువీర్రాజుకు ఫోన్ చేశారని సమాచారం.మీ పదవి కాలం ముగిసింది.
మిమ్మల్ని మిస్ అవుతున్నామన్న ఆయన రాజీనామా చేయాల్సిందిగా సోము వీర్రాజుకు చెప్పారని తెలుస్తోంది.ఈ విషయాన్ని స్వయంగా సోము వీర్రాజు వెల్లడించారు.
కాగా జూలై27, 2020 నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు కొనసాగుతున్నారు.అదేవిధంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సత్యకుమార్ పేరు దాదాపు ఖరారు అయిందని తెలుస్తోంది.
దీనిపై త్వరలోనే పార్టీ హైకమాండ్ ప్రకటన చేసే అవకాశం ఉంది.అయితే గత కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల మార్పుపై చర్చ విస్తృతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.







