వచ్చే ఎన్నికలలో జనసేనతోనే బీజేపీ సోము వీర్రాజు కీలక కామెంట్స్..!!

అల్లూరి 125 వ జయంతి ఉత్సవ కార్యక్రమాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గైర్హాజరు కావడంతో.బీజేపీ -జనసేన మిత్రబృందంపై రకరకాల వార్తలు వస్తున్నాయి.

 Ap Bjp Leader Somu Veeraaju Sensational Comments Details, Ap Bjp Leader Somu Vee-TeluguStop.com

ఇటువంటి తరుణంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమ వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.మోడీ సభ విజయవంతం కావాలని కోరుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వీడియోస్ సందేశం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు.

జనసేన మరియు బీజేపీ పార్టీలు కలిసే ఉన్నాయని ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదని పేర్కొన్నారు.

అంతేకాదు వచ్చే ఎన్నికలలో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని క్లారిటీ ఇచ్చారు.

భీమవరం అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి.పవన్ కి ఆహ్వానం అందించడం జరిగింది.

కానీ పలు కారణాలతో రాలేకపోయారని అన్నారు.పార్టీ బలోపేతం విషయంలో ఎవరి కార్యక్రమాలు వాళ్ళవి.

ఈ క్రమంలో పవన్ రాకపోవటాన్ని కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారు.భీమవరంలో మోడీ సభ విజయవంతం అయ్యిందని సోము వీర్రాజు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube