ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు తమ సినీ జీవితాన్నే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ముఖ్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు మాత్రం పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ అంతేకాకుండా ఫ్యామిలీని కూడా తయారు చేసుకుంటున్నారు.
దీంతో ఫ్యామిలీ లైఫ్ ముఖ్యమని సినిమాలకు కూడా కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీ జీవితంతో సంతోషంగా జరుపుకున్నారు.
కొందరు సినిమాల పిచ్చితో తమ మంచి జీవితాన్ని కూడా వదిలేసుకున్నారు.
ఉదాహరణకి సమంత అనే చెప్పవచ్చు.ఈమె తన కెరీర్ కోసం మంచి లైఫ్ ను వదులుకుంది.
కానీ కాజల్, ప్రణీత లాంటి హీరోయిన్లు మాత్రం మంచి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.తాజాగా ఓ నెటిజన్ ప్రణీతకు ప్రశంసలు కురిపిస్తూ సమంతను టార్గెట్ చేసినట్లు కనిపించారు.
ఇంతకూ అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి కన్నడ బ్యూటీ ప్రణీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తన అందంతో, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.తొలిసారిగా ఏం పిల్లో.
ఏం పిల్లడో అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో తన పాత్రకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఆ తర్వాత బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో కూడా నటించింది.కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా మెప్పించలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.ఈమె టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి మంచి సక్సెస్ లు అందుకుంది.అంతేకాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.
ఆ తర్వాత ఈమె బాలీవుడ్ లో మంచి సక్సెస్ లో ఉన్న సమయంలో.బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయింది పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.ఇక ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.
అప్పుడప్పుడూ తన వ్యక్తిగత విషయాలను, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇక తనకు సంబంధించిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
పైగా ఆ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
దీంతో ఆమెను ఎంతోమంది ప్రజలు మెచ్చుకున్నారు.అంతేకాకుండా తన పై ప్రశంసలు కురిపించారు.తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా లో ఒక క్యూట్ వీడియో పంచుకుంది.
ఆ వీడియోకు లైక్ లతో పాటు కామెంట్లు కూడా వస్తున్నాయి.ఇక అందులో ఓ నెటిజన్ సమంతను టార్గెట్ చేసి ప్రణీత పై ప్రశంసల వర్షం కురిపించారు.
మిమ్మల్ని చూసి కొందరు సిగ్గుపడాలి.సినిమాల కోసం ఆశపడి మ్యారేజెస్ వదులుకొని చండాలంగా బతుకుతున్నారు.
ప్రణిత మేడం ని చూసి కొందరు గర్వపడాలి అని అనడంతో ఆ కామెంట్ సమంత ను ఉద్దేశించి చేసినట్లు అర్థమవుతుంది.