మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ ఎట్టకేలకు క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది.కరోనా పరిస్థితి తరువాత థియేటర్లు తెరుచుకోవడంతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమాను భారీ అంచనాల నడుమ రిలీజ్ చేశారు.
థియేటర్లు తెరుచుకున్న తరువాత రిలీజ్ అవుతున్న తొలి భారీ సినిమా కావడంతో ఈ సినిమాపై అందరి చూపులు ఉన్నాయి.
ఇక రిలీజ్ అయిన రోజే ఈ సినిమాకు మంచి టాక్ రావడం, థియేటర్లు తెరుచుకున్నాక సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడంతో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది.
ఇక తొలిరోజు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.ఈ సినిమాను స్టార్ హీరోలు ప్రమోట్ చేయడం, సినిమా టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపారు.అయితే 50 శాతం అక్యుపెన్సీతో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈ సినిమా తొలిరోజు ఏకంగా రూ.4.7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
తేజు యాక్టింగ్, థమన్ సంగీతం, సుబ్బు టేకింగ్ కలగలిసి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చేలా చేశాయి.
ఈ సినిమాతో తేజు మరోసారి తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేశాడని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా ఏరియాల వారీగా సాధించిన ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
నైజాం – 1.84 కోట్లు
సీడెడ్ – 0.86 కోట్లు
నెల్లూరు – 0.20 కోట్లు
కృష్ణా – 0.21 కోట్లు
గుంటూరు – 0.43 కోట్లు
వైజాగ్ – 0.57 కోట్లు
ఈస్ట్ – 0.34 కోట్లు
వెస్ట్ – 0.25 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.4.70 కోట్లు