నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’.బాలయ్య కేరీర్ లో 107వ సినిమాగా తెరకెకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే పీక్స్ లో ఉన్నాయి.
ఇక ఈ సినిమా ప్రెజెంట్ అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ చేయడంతో ఈ నెలలోనే వీలైనంత వరకు షూటింగ్ పూర్తి చేయాలని కష్టపడుతున్నారు.
ఈ సినిమా కంటే ముందు బాలయ్య అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.దీనిని బోయపాటి యాక్షన్ బ్లాక్ బస్టర్ గా తెరకెక్కించాడు.
ఇందులోని యాక్షన్ సన్నివేశాలు బాగా అలరించాయి.
ఇక ఇప్పుడు గోపీచంద్ కూడా అఖండ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా యాక్షన్ లవర్స్ ను ఆకట్టు కోవడానికి భారీ సన్నివేశాలను రెడీ చేసాడట.
ఈ సినిమాలో నెక్స్ట్ లెవల్ యాక్షన్ సీక్వెన్స్ లు చాలానే డిజైన్ చేశారట.దీంతో ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ అంచనాలను రీచ్ అయ్యే విధంగానే ఉంటుందట.
మొత్తం 10కి పైగానే యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయట.మరి ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షన్ హీరోగా చూడడం కోసం అంతా ఈగర్ గా వైట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు టైటిల్ ప్రకటన రోజే కన్ఫర్మ్ చేయడంతో ఈసారి సంక్రాంతి పోరు రసవత్తరంగా మారింది.