శోభన్ బాబు కొడుకు సినిమాల్లోకి రాకపోవడానికి కారణమేంటో మీకు తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో శోభన్ బాబు వరుస విజయాలతో గుర్తింపును సంపాదించుకున్నారు.కథాబలం ఉన్న సినిమాలలో శోభన్ బాబు ఎక్కువగా నటించగా ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించి ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 Sobhan Babu Shocking Comments About His Son Cine Entry Details Here Sobhan Babu-TeluguStop.com

ఆంధ్రుల అందాల నటుడిగా శోభన్ బాబు ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకున్నారు. రైతు కుటుంబంలో జన్మించిన శోభన్ బాబు సినిమాలపై ఇష్టంతో సినిమాల్లోకి వచ్చారు.

ఉదయం కాలేజ్ కు వెళుతూ మధ్యాహ్నం స్టూడియోల చుట్టూ తిరుగుతూ శోభన్ బాబు సినిమాల్లో సక్సెస్ కావడం కొరకు ఎంతో కష్టపడ్డారు.కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రల్లో నటించే అవకాశం రాగా వాటికి ఓకే చెప్పి శోభన్ బాబు సత్తా చాటారు.

వయస్సు పెరిగిన తర్వాత శోభన్ బాబు సినిమాలకు దూరంగా ఉన్నారు.సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును స్థలాలపై ఇన్వెస్ట్ చేసి ఊహించని స్థాయిలో శోభన్ బాబు సంపాదించారు.

Telugu Carrer, Raja Ravindra, Sobhan Babu, Sobhan Babu Son, Tollywood-Movie

ఆ కాలంలో అమ్మాయిలు శోభన్ బాబులా అందంగా ఉండే వ్యక్తి తమకు భర్తగా కావాలని కోరుకునేవారు.అయితే శోభన్ బాబు కుటుంబ సభ్యులెవరూ సినిమా ఇండస్ట్రీలోకి రాలేదు. రాజా రవీంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హీరో కావాలని అనుకోలేదని తెలిపారు.హీరోగా తాను నటించిన సినిమాలు సక్సెస్ కాలేదని ఆయన తెలిపారు.ఒక సందర్భంలో శోభన్ బాబును మీ కొడుకును ఎందుకు హీరో చేయలేదని అడిగానని రాజా రవీంద్ర తెలిపారు.ఆ సమయంలో శోభన్ బాబు తాను కష్టపడతానని ప్రతి సినిమా విషయంలో టెన్షన్ పెడతానని తన కొడుకు కూడా ఎందుకు టెన్షన్ పడాలని శోభన్ బాబు చెప్పారని శోభన్ బాబు కొడుకు సినిమాల్లోకి రాకపోవడానికి కారణం ఇదేనని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు.

నా కొడుకు ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నానని శోభన్ బాబు చెప్పారని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube