అమెరికాలోకి అక్రమంగా ఎంతో మంది వలసదారులు ప్రవేశించడాన్ని ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు.అసలు వారు అమెరికా భూభాగంలోకి ఎంట్రీ ఇవ్వకూడదు అనేట్టుగా ఖటినమైన చర్యలు తీసుకున్నారు కూడా.
రక్షణ చర్యలు చేపడుతూ, అమెరికా సరిహద్దుల వద్ద వేలాదిమంది పోలీసులని నియమిస్తున్నారు ట్రంప్.కానీ ట్రంప్ కి షాక్ ఇస్తూ ఎంతో మంది వలసదారులు అమెరికాలోకి ప్రవేసిస్తున్నారు.
అది ఎలా అనే విషయాన్ని ఓ అమెరికన్ తానూ తీసిన ఓ వీడియో ద్వారా బయటపెట్టాడు.

టెక్సాస్ లోని ఎల్పరో నగరం అమెరికా, మెక్సికో బోర్డర్ ప్రాంతం.తాజాగా ఓ అమెరికన్ పోస్ట్ చేసిన వీడియో ద్వారా అసలు వలసదారులని కట్టడి చేయడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా సరే ఎలా అమెరికాలోకి అడుగు పెడుతున్నారు అనే సందేహాలపై ఓ క్లారిటీ వచ్చింది.రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్ హోల్ నుంచీ ఒకరు తరువాత ఒకరుగా మొత్తం ముగ్గురు వ్యక్తులు బయటకి వచ్చారు.
ఈ వీడియోని తీసిన అమెరికన్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దాంతో ఇప్పుడు ఆ వేడియో అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.కానీ వచ్చిన వారు వలస దారులా కాదా అనే విషయం పై ఇప్పటి వరకూ స్పష్టత లేదు.అయితే వారు వలసదారులే నని, ఒక వేళ అలా కాకపొతే వారు ఆందోళన పడవలసిన అవసరం ఏముందని వాదిస్తున్నారు.