ఓవ‌ర్ కేరింగ్‌లో మీరు ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నారో గ‌మ‌నించారా?

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య లేదా స్నేహితులు, బంధువుల మ‌ధ్య‌ ప్రేమ మరియు పరస్పర అవగాహన ఉన్న‌ప్పుడే ఆ బంధాలు క‌ల‌కాలం నిలిచివుంటాయి.

కొన్నిసార్లు రిలేషన్‌షిప్‌లో ఎక్కువ కేర్ తీసుకోవ‌డం వివాదాలు ఏర్ప‌డ‌టానికి కారణం కావచ్చు.

ఎదుటి వ్య‌క్తికి ఎక్కువ‌గా ప్రేమించ‌డం వ‌ల‌న‌ మ‌న‌కు తెలియ‌కుండానే కొన్ని త‌ప్పులు చేస్తుంటాం.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేమ మరియు సంరక్షణ అనేవి అనుబంధాల‌లో బలంగా పనిచేస్తాయి.కానీ వీటిలో ఏదైనా ఎక్కువ హాని కలిగించవచ్చు.

మీరు మీ భాగస్వామిని అతిగా ప్రేమిస్తే.ఈ కారణంగా అధికంగా కేర్ తీసుకుంటే.

Advertisement

అది ఏదో ఒక రోజు ప్రతికూలంగా మారే అవ‌కాశ‌ముంది.మానసిక వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అతిగా శ్రద్ధ వహించడం వల్ల, భాగస్వామి ఒక సమయంలో చికాకుపడతారు.

చాలామంది వారిలోని అధిక ప్రేమ, కేరింగ్‌ కారణంగా ఎదుటి వ్య‌క్తికి అలోచించుకునేందుకు కూడా అవ‌కాశం ఇవ్వ‌రు.ఇది అవసరం అని గుర్తించాలి.

దీనిని విస్మ‌రిస్తే తర్వాత ఎదుటివారితో గొడవలు మొదలవుతాయి.వాస్తవానికి ఏదైనా అనుబంధంలో ప‌రిస్థితుల‌ను బ్యాలెన్స్ చేయ‌డానికి ఎదుటి వ్య‌క్తికి కొంత స‌మ‌యం ఇవ్వ‌డం చాలా ముఖ్యమైనదిగా గుర్తించండి.

త‌ద్వారా భాగస్వాములు లేదా స్నేహితులు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు.ఫ‌లితంగా వారి సంబంధం బ‌ల‌ప‌డుతుంది.ఎదుటివారిపై కేరింగ్ చూపించే విష‌యంలో చాలామంది ఆధిపత్య స్వభావాన్ని చూపిస్తారు.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
రీల్స్ పిచ్చి తగలయ్య.. బైక్ పై మరో బైక్ ఉంచి యువకుల సాహసాలు..

త‌మ అభిప్రాయాల‌ను ఎదుటివారిపై రుద్దే ప్ర‌య‌త్నం చేస్తారు.ఇది త‌ప్పు అని కూడా వారు గ్ర‌హించ‌రు.

Advertisement

ఈ ఆధిపత్య స్వభావం కారణంగా అలాంటి వారు తరచుగా ఎదుటివారికి ఇబ్బందులు క‌ల్పిస్తారు.ఇలా చేయడం వల్ల భాగస్వామికి చిరాకు వస్తుంది.

ఫ‌లితంగా వారి అనుబంధం బీట‌లు వారుతుంది.

తాజా వార్తలు