చాట్ జీపీటీ అనేది యూజర్ అడిగే ప్రశ్నలకు జవాబులు చెబుతుంది.ప్రస్తుతం చాట్ జీపీటీ 2 వెర్షన్లు అందుబాటులో వున్నాయి.
ఒకటి ఉచితం, మరొకటి డబ్బులు కట్టి వాడే చాట్ జీపీటీ ప్లస్ వెర్షన్.అయితే, అమెరికన్ కంపెనీ ఓపెన్ ఏఐ,( OpenAI ) చాట్ జీపీటీ ఆండ్రాయిడ్ వెర్షన్ యాప్‌ను స్టార్ట్ చేసింది.
ఇంతకుముందు, చాట్ జీపీటీ ఐఫోన్స్ వినియోగదారుల కోసం మాత్రమే అందుబాటులో ఉండేది.కానీ, ఇప్పుడు చాట్ జీపీటీ యాప్‌ని ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది.
ఓపెన్ ఏఐ ప్రస్తుతం మనదేశంతో పాటు యూఎస్, బంగ్లాదేశ్, బ్రెజిల్ దేశాల్లో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ యాప్‌ను తీసుకొచ్చింది.ఈ విషయాన్ని కంపెనీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.

మరికొన్ని దేశాల్లో త్వరలోనే అందుబాటులోకి రానుందని సమాచారం.చాట్‌జీపీటీ యాప్‌ను( ChatGPT ) గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఈ క్రమంలో మీకు నకిలీ యాప్‌లు కూడా కనిపిస్తాయి.అవి తప్పక చెక్ చేసుకోవాలి.ఒరిజినల్ చాట్ జీపీటీ యాప్ లోగో నలుపు రంగులో ఉంటుంది.దాని మీద క్లిక్ చేస్తే చాట్ జీపీటీ కింద రాసిన ఓపెన్ ఏఐ కనిపిస్తుంది.
యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తరువాత సైన్‌అప్ చేయాలి.దానికోసం ఇ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి, పాస్వర్డ్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వచ్చు.

ఇకపోతే సెప్టెంబర్ 2011లో లాంచ్ అయిన శ్నాప్‌చాట్,( SnapChat ) 2015లో లెన్స్ ఫీచర్స్ పరిచయం చేసింది.ఇక లెన్స్ ఫీచర్స్( Lens Feature ) వాడే యూజర్లకు ఓ అదిరిపోయే శుభవార్త.అదేంటంటే, మనదేశంలో శ్నాప్‌చాట్ ఏఆర్ (ఆగ్యుమెంటెడ్ రియాలిటీ) వాడే వాళ్ల కోసం ఒక రివార్డ్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసింది శ్నాప్‌చాట్.దాని పేరు ‘లెన్స్ క్రియేటర్ రివార్డ్స్’.
ఇది ఇండియన్స్ కోసం మాత్రమే కాదండోయ్.గ్లోబల్ యూజర్స్‌కు కూడా.
ఎప్పటికప్పుడు వచ్చే కొత్త ఫీచర్స్ వాడడంలో యాక్టివ్‌గా ఉన్నవాళ్లకు ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇండియన్ లెన్స్ క్రియేటర్స్ 7,200 డాలర్లు (దాదాపు ఆరు లక్షలు) ప్రతి నెలా పొందొచ్చు.
శ్నాప్‌చాట్ రెవెన్యూ జూన్ 30 నాటికి దాదాపు ఎనిమిది కోట్లకుపైనే ఉంది.







