పామును చూస్తే చాలా మంది భయంతో వణికిపోతారు.ఇక విద్యార్థులు, చిన్నపిల్లలు ఆమడదూరం పరుగెడతారు.
అలాంటిది ఓ విద్యార్థి బాగులో పాము కనిపించడంతో క్లాస్ రూంలోని విద్యార్థులు పరుగులు పెట్టారు.ఉపాధ్యాయుడు విషయం తెలుసుకొని బ్యాగును బయటకు తీసుకెళ్లి బ్యాగులో పుస్తకాల చాటున దాక్కున్న పామును వదిలేశాడు.
అది బుసలు కొడుతూనే అక్కడి నుంచి వెళ్లిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ గ్రామంలోని పాఠశాలలో చోటు చేసుకుంది.