రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానం ముందుకు పలు డిమాండ్ లు తీసుకువచ్చారు.తమ గోడును పార్టీ పట్టించుకోవాలని కోరారు.
అశోక్ గెహ్లాట్ ను రాజస్థాన్ సీఎంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలో గెలిచినా సీఎంగా గెహ్లాట్ నే కొనసాగించాలన్నారు.
ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటే ఆయన సూచించిన వ్యక్తినే సీఎం చేయాలని డిమాండ్లలో పేర్కొన్నారు.మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభంపై పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టి సారించారు.
దీనిలో భాగంగా రాజస్థాన్లో చోటుచేసుకున్న పరిస్థితులను చక్కదిద్దాలని కేసీ వేణుగోపాల్ కు సూచించారు.







