సోషల్ మీడియా పరిధి రోజురోజుకీ పెరిగిపోతుంది.చిన్నపిల్లనుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇపుడు స్మార్ట్ ఫోన్ మీద ఆధారపడి బతుకుతున్నారు.
అందువలన ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.
మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.అలాగే ఇంకొన్ని మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి.
అయితే తాజా సర్వే ప్రకారం వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటున్నాయని సమాచారం.అందులోనూ ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.
తాజాగా సోషల్ మీడియాలో ఓ పాముకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.కొంతమంది ఫారినర్స్ నీలం రంగులో ఉన్న నది ప్రవాహంలో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.యువతీయువకులు అందరూ ఈత కొడుతూ సరదాగా అక్కడ గడుపుతున్నారు.ఇంతలో ఊహించని పరిణామం… అకస్మాత్తుగా ఒక పెద్ద పాము నీటిలోకి ప్రవేశించి, బండపై కూర్చున్న ఒక యువకుడి వెంట పడింది.
పాము వెంటాడుతుండడంతో ఆ యువకుడు వెంటనే నీళ్లలో నుంచి బయటకు పరుగెత్తాడు.ఇక్కడ గమ్మత్తేమిటంటే, ఆ యువకుడు భయపడకుండా ఈ దృశ్యంను తన మొబైల్‌లో చిత్రీకరించడం.
పెద్ద పాము నీటిలోకి రాగానే అందరూ గబగబా ఒడ్డుకి చేరుకోగా.ఆ యువకుడు మాత్రం అలానే ఈత కొడుతూ ఆ పాముని తిలకించడం కొసమెరుపు.ఈ వీడియోను ఇటీవల ‘వైల్డ్‌స్టిక్’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.దీనికి 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ మరియు 108k లైక్‌లు రావడం విశేషం.వీడియో చూసిన నెటిజన్లు అందరూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
మరెందుకాలస్యం, మీరు కూడా సదరు వీడియోని తిలకించి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మరి!
.






