హైదరాబాద్ లోని సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ఇంజన్ లో పొగలు వచ్చిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన కొంత సమయానికే ఇంజన్ లో ఒక్కసారిగా దట్టమైన పొగలు వచ్చాయని తెలుస్తోంది.
పొగను గుర్తించి వెంటనే అప్రమత్తమైన లోకో ఫైలట్ బీబీ నగర్ రైల్వేస్టేషన్ లో రైలును నిలిపివేశారు.అనంతరం రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఈ క్రమంలోనే ఇంజన్ బ్రేక్ లైనర్లు బలగా పట్టేయడం వలన పొగలు వచ్చినట్లు గుర్తించారు.
మరమ్మత్తులు చేసిన తరువాత దాదాపు 20 నిమిషాల ఆలస్యంగా రైలు బయలు దేరింది.అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.







