నయా లుక్ తో విడుదలైన స్మార్ట్ వాచ్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..?

భారతదేశంలో స్మార్ట్ వాచ్ ( Smart watch )లు వాడే వారి సంఖ్య భారీగా పెరుగుతూ ఉండడంతో ప్రముఖ స్మార్ట్ వాచ్ కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టి సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లను విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.గతంలో వాచ్లు కేవలం టైం చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు.

 Smart Watch Released With A New Look What Are The Features , Smart Watch Release-TeluguStop.com

టెక్నాలజీ అభివృద్ధి చెందిన క్రమంలో ఒక మినీ ఫోన్ లాగా స్మార్ట్ వాచ్ లు అందుబాటులోకి వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రముఖ పెబుల్ కాస్మోస్ వాల్ట్ బ్రాండ్ నుంచి కాస్మోస్ సిరీస్ స్మార్ట్ వాచ్( Cosmos Series Smart Watch ) భారతదేశంలో విడుదలయ్యింది.

కాస్మోస్ వాల్ట్ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ స్మార్ట్ వాచ్ లో మెటల్ చక్రం, పట్టీ, క్రౌన్ ఉన్నాయి.ఈ స్మార్ట్ వాచ్ 1.43 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్ ప్లే కలిగి ఉంది.ఆన్ – ఫంక్షనాలిటీ, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కలిగి ఉంది.

పెబుల్ వెబ్సైట్, మింత్రా, ఫ్లిప్ కార్ట్( Pebble website, Myntra, Flipkart ) లలో కొనుగోలు చేయవచ్చు.ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.2999 గా ఉంది.ఈ స్మార్ట్ వాచ్ రోజ్ గోల్డ్, క్లాసిక్ సిల్వర్, అబ్సిడియన్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్ వాచ్ గూగుల్ అసిస్టెంట్ మద్దతుతో ఆండ్రాయిడ్, ఐఓఎస్ కు అనుకూలంగా ఉంటుంది.వినియోగదారులు ఈ స్మార్ట్ వాచ్ లో అంతర్నిర్మిత డయల్ ప్యాడ్ నుంచి కాల్స్ చేయడం తో పాటు ఇతర నోటిఫికేషన్ కూడా యాక్సెస్ చేయవచ్చు.అంతేకాకుండా ఎస్పీఓ2 , రక్తంలో ఆక్సిజన్ స్థాయి ట్రాకింగ్, పెడోమీటర్, స్లీప్ ట్రాకింగ్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.ఇక బ్యాటరీ విషయానికి వస్తే 240 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

ఈ స్మార్ట్ వాచ్ మ్యాగ్నెటిక్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube