యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని ( Ram Pothineni )హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”స్కంద”.ఈ సినిమా వినాయక చవితి బరిలో రావాల్సి ఉండగా డేట్ మార్చుకుని ఒక వారం లేటుగా వచ్చింది.
బిగ్ మాస్ మసాలాగా తెరకెక్కిన స్కంద మూవీ మొన్న సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మొన్న గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా స్కంద సినిమా( Skanda )యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది.
అయితే వీకెండ్ లో కలెక్షన్స్ బాగానే రాబట్టి పర్వాలేదు అనిపించుకుంది.మరి స్కంద ఇప్పటి వరకు ఎంత రాబట్టిందంటే.
మాస్ ఏరియాల్లో బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా డీసెంట్ వసూళ్లను రాబడుతూ ముందుకు పోతుంది.

ఈ సినిమా వీకెండ్ ముగిసి సోమవారం కూడా హాలిడే కావడంతో బాగానే కలిసి వచ్చింది అనే చెప్పాలి.ఇక ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 50 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసి 50 కోట్ల క్లబ్ లో అయితే చేరినట్టు తెలుస్తుంది.ప్లాప్ అవుతుంది అనుకున్న ఈ సినిమా యావరేజ్ టాక్ తోనే కలెక్షన్స్ రాబడుతుంది.అయితే సెలవలు ముగిసి మళ్ళీ వీక్ డేస్ స్టార్ట్ అవ్వడంతో కలెక్షన్స్ కు దెబ్బ పడడం ఖాయం…

70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 54 కోట్లు కలెక్ట్ చేసింది.చూడాలి మరి ముందు ముందు ఎన్ని కలెక్షన్స్ రాబడుతుందో.ఇక ఇందులో రామ్ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల( Sreeleela )హీరోయిన్ గా నటించగా రామ్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుందో లేదో చూడాలి.థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు.







