ఇటీవల దీపావళి వేడుకల సందర్భంగా బ్రిటన్( Britain )లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో భారత సంతతికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు దుర్మరణం పాలయ్యారు.మృతుల్లో ముగ్గురు చిన్నారులు వుండగా.
ఇద్దరు పెద్దలు.ఆదివారం రాత్రి బ్రిటన్ రాజధాని లండన్‌లో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మెట్రోపాలిటన్ చీఫ్ పోలీస్ సీన్ విల్సన్ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.మృతులను సీమా రాత్రా, ఆమె ముగ్గురు పిల్లలు రియాన్, షనాయా, ఆరోహిగా గుర్తించారు.
మంటల నుంచి తప్పించుకున్న ఆమె భర్త ఆరోన్ కిషన్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.

ఆ ప్రమాదం జరిగిన నాటి నుంచి శిథిలాల తొలగింపు చేస్తుండగా ఆరవ మృతదేహాన్ని కనుగొన్నారు.ఈ సందర్భంగా డిటెక్టివ్ చీఫ్ ఇన్స్‌పెక్టర్ గార్త్ హాల్ మాట్లాడుతూ.గోడలు పైకి లేపి, పైకప్పును తొలగించిన తర్వాత మాత్రమే శోధన బృందాలు ప్రాంగణంలోకి ప్రవేశించడానికి వీలు కలిగిందని పేర్కొన్నారు.
ఇప్పుడు ఆరో వ్యక్తి మరణాన్ని విచారకరంగా ధృవీకరించగలిగాల్సి వచ్చిందన్నారు.అగ్నిప్రమాదానికి కారణం తెలుసుకోవడానికి మెట్రోపాలిటన్ పోలీసులు, లండన్ అగ్నిమాపక దళం సంయుక్త విచారణ చేపట్టాయి.పోస్ట్‌మార్టం సరైన సమయంలో జరుగుతుందని, సంబంధిత కుటుంబాలకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.ఘటన జరిగిన రోజు మంటలను అదుపు చేసేందుకు 10 ఫైరింజన్లు, 70 మంది అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపారు.
ఈ ప్రమాదంలో మిడ్ టెర్రస్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తు ధ్వంసమయ్యాయి.పైకప్పు కూడా కొంత భాగం దెబ్బతింది.
మంటలు చెలరేగిన తర్వాత ‘‘నా పిల్లలు, నా పిల్లలు ’’ అని అరుస్తూ కిషన్ ( Aroen Kishen )ఇంటి నుంచి తప్పించుకున్నట్లు తాము చూశామని పొరుగువారు పోలీసులకు చెప్పారు.

ఈ ఘటనపై మాంచెస్టర్( Manchester )కు చెందిన భారత సంతతి వ్యక్తి దిలీప్ సింగ్ మాట్లాడుతూ.ఆ భవనంలో తన బావ వున్నారని , సమాచారం అందిన వెంటనే ఇక్కడకు వచ్చామని చెప్పారు.ఒక డబ్బా నుంచి మంటలు చెలరేగాయని చెబుతున్నారని.
ఏం జరిగిందో తెలియాల్సి వుందన్నారు.
.