ప్రపంచవ్యాప్తంగా గత కొద్ది నెలల నుండి భారీ ఎత్తున భూకంపాలు సంభవిస్తున్నాయి.ఫిబ్రవరి 6వ తారీఖున టర్కీ, సిరియా.
దేశాలలో సంభవించిన భూకంపం దాటికి దాదాపు 50 వేల మంది మరణించడం జరిగింది.లక్షలాది మంది నిరాశ్రులయ్యారు.
మళ్లీ కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతంలో భూకంపం రాగా పదుల సంఖ్యలో మరణించారు.వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు.
దీంతో టర్కీ, సిరియా భూకంప బాధితులను ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకు వస్తూ ఉన్నాయి.ఇక ఇదే సమయంలో భూకంపం లో నిరాశ్రులైన వారికి అక్కడి ప్రభుత్వం లక్షలాది ఇల్లు నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు జపాన్ లోని హోక్కైడ్ ద్వీపంలో భూకంపం సంభవించింది.ఒక్కసారిగా భూకంపదాటికి సైరన్ లు మోగటంతో ఆ ద్వీపవాసులు… ఎవరికి వారు అప్రమత్తమయ్యారు.నేమురో ప్రాంతంలో 61 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ రీఛార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎర్త్ సైన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (NIED) వెల్లడించడం జరిగింది.అయితే భూకంప దాటికీ ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.
ఇక ఇదే సమయంలో సునామీ ముప్పు లేదు అని కూడా అధికారులు తెలియజేశారు.







