తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ జీవిత, రాజశేఖర్ ల గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు సినిమాలలో హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ జంట రియల్ లైఫ్ లోనే కపుల్ గా మారారు.
ఇకపోతే ఈ దంపతుల ముద్దుల కుమార్తె శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి బాగానే ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే పరిస్థితి మాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శివాని రాజశేఖర్.
ఇది ఇలా ఉంటే శివాని రాజశేఖర్( Shivani Rajashekar ) నటిస్తున్న తాజా చిత్రం కోట బొమ్మాలి పిఎస్( Kota bommali PS ) ఈ సినిమా ఈ నెల అనగా నవంబర్ 24న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో శ్రీకాంత్( Srikanth ), వరలక్ష్మీ శరత్‌కుమార్, శివానీ, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు.దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అప్పుడే మొదలయ్యాయి.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది శివాని.
కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శివాని రాజశేఖర్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా శివాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వ్యూలో భాగంగా రాజశేఖర్ కుటుంబానికి మెగా ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయని, వాటిపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించగా ఆ విషయంపై శివాని రాజశేఖర్ స్పందిస్తూ.లోపల బియ్యం గింజ అంత జరిగితే బయటకి బిర్యానీ అంత కనిపిస్తుంది.
మీరు అడిగిన దాంట్లో నిజం ఉంది.పాలిటిక్స్ అన్న తర్వాత కొన్ని విభేదాలు రావడం సహజమే.ఎన్ని విభేదాలు ఉన్నా కూడా సమయం వచ్చినపుడు అందరూ కలిసిపోతారు.ప్రొఫెషనల్‌గా వేరు, పర్సనల్‌గా వేరుగా ఉంటుంది.అయితే, ఆ వివాదాలన్నీ ఒక హీట్ మూమెంట్‌లో మాత్రమే జరిగాయి.మా మధ్య జరిగిన గొడవల గురించి బయటివాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఎప్పుడో జరిగిన చిన్న వివాదం వల్ల వాళ్ళ ప్రొడక్షన్ లో నేను, మా ప్రొడక్షన్‌లో వాళ్ళు నటించకూడదని ఏమీ ఉండదు కదా అని తెలిపింది శివానీ.ఈ వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా బాగా చెప్పారు శివాని గారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.