ఖుషి సినిమా( Khushi ) రిలీజ్ కి రెడీ గా ఉన్న విషయం మనకు తెలిసిందే…ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధిస్తుంది అనే విషయం తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి.ఇక ఈ సినిమా కనక మంచి విజయం సాధిస్తే శివ తన నెక్స్ట్ సినిమాని ఒక స్టార్ హీరో తో చేయబోతున్నట్టు గా తెలుస్తుంది…ఆయన ఎవరు అనేది ఇంకా ఒక క్లారిటీ రానప్పటికి ఇప్పటికే ఆయన ఒక ఇద్దరు స్టార్ హీరోలకు రెండు కథలు చెప్పారట… అందులో ఒకరితో సినిమా ఉంటుంది అనే విషయం అయితే స్పష్టం గా తెలుస్తోంది…
నిజానికి శివ నిర్వాణ( Shiva nirvana ) ఒక మంచి డైరెక్టర్ ఆయన చేసిన సినిమాల్లో ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది.ఇక ఆయన నాగచైతన్య ,సమంత తో చేసిన మజిలీ సినిమా అయితే ఇప్పటికీ అందరికీ విపరీతంగా నచ్చిన సినిమా అనే చెప్పాలి…అందుకే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు…అయితే తను తీసిన మూడు సినిమాల్లో ఒక్క టక్ జగదీష్ సినిమా( Tuck Jagadish )తప్ప మిగిలిన రెండు సినిమాలు అయిన నిన్ను కోరి,మజిలీ ( Majili )ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.ఇక ఇప్పుడు ఖుషి సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ తన ఫామ్ ని కంటిన్యు చేయాలని చూస్తున్నాడు….
ఇక ఈ సినిమా హిట్ అవ్వడం శివ కి ఎంత అవసరమో విజయ్ కి, సమంత( Samantha ) కి కూడా అంతే అవసరం ఎందుకంటే ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా ప్లాప్ ల్లోనే ఉన్నారు.అందుకే ఈ సినిమా సక్సెస్ ఈ ముగ్గురి కెరియర్ కి చాలా ముఖ్యం…ఈ సినిమా సక్సెస్ అయితే శివ కి ఒక పెద్ద బంపర్ ఆఫర్ తగిలినట్టే…