కోలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న యంగ్ హీరో శివ కార్తికేయన్ ఆల్రెడీ డాక్టర్, డాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకోగా తన నెక్స్ట్ సినిమా ప్రిన్స్ తో కూడా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.జాతిరత్నాలు ఫేం అనుదీప్ కెవి డైరక్షన్ లో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న సినిమాకు టైటిల్ గా ప్రిన్స్ అని ఫిక్స్ చేశారు.
జాతిరత్నాలతో ప్రేక్షకులను అలరిచిన డైరక్టర్ అనుదీప్ శివ కార్తికేయన్ మార్క్ టైమింగ్ తో ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.
ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా అవుట్ పుట్ మీద చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉందని తెలుస్తుంది.
అనుదీప్ ఈ సినిమాతో కూడా తన రైటింగ్ టాలెంట్ చూపిస్తున్నాడని అంటున్నారు.ప్రిన్స్ తో శివ కార్తికేయన్ తెలుగు, తమిళ భాషల్లో హ్యాట్రిక్ హిట్ గురి పెట్టారు.
చూస్తుంటే అనుకున్న విధంగా సినిమా సక్సెస్ అందుకునేలా ఉంది.ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ మరో బైలింగ్వల్ సినిమాకు సైన్ చేస్తున్నాడని తెలుస్తుంది.
ఆ సినిమాకు సంబందించిన డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.ప్రిన్స్ మూవీ ని ఏషియన్ సినిమాస్ బ్యానర్ నో సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు.