అక్కడొకడుంటాడు` ఫేమ్ శివ కంఠమనేని (Shiva Kantamaneni) హీరోగా భద్రాద్రి, కత్తి చిత్రాల దర్శకుడు మల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం `మధురపూడి గ్రామం అనేనేను(Madhurapudi Gramam Ane Nenu) క్యాథలిన్ గౌడ హీరోయిన్‌గా నటించింది.బ్రహ్మ మని శర్మ సంగీత సారధ్యంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా కథ ఏమిటి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
కథ:
మధురపూడి( Madhurapudi ) అనే గ్రామంలో ఈ సినిమా కథ కొనసాగుతుంది.ఆ గ్రామం తన ఆత్మ కథను చెప్పుకునే కోణంలో దర్శకుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఊర్లో సూరి (శివ కంఠమనేని)( Shiva Kantamaneni ) ఓ మొరటోడు, మొండోడు.
సూరి తన స్నేహితుడు బాబ్జీ కోసం ఎంత వరకైన నిలబడతాడు.తన ఫ్రెండ్ మంచి కోసం ప్రాణాలిచ్చేందుకైనా, తీసేందుకైనా ఏమాత్రం వెనకాడరు.
స్నేహితుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమైనటువంటి సూరీ జీవితంలోకి హీరోయిన్ క్యాథలిన్ గౌడ( Kathleen Gowda ) ఎలా వస్తుంది? ఆమె వచ్చాక సూరీ జీవితం ఎలా మారిపోయింది ? సూరి బాబ్జిల స్నేహబంధం ఎలాంటి మలుపు తిరిగింది.ఆ గ్రామం రాజకీయాల్లో సూరి పాత్ర ఏంటి అన్న కోణంలో ఈ సినిమా కథ కొనసాగుతుంది.

నటీనటుల నటన:
రోజు మనం తెరపై చూసే హీరోలు ఈ సినిమా కథను కనుక చేస్తే ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి ఉండదు కానీ ఈ సినిమాలో శివకంఠమనేని హీరోగా చేయడం వల్ల సినిమాపై ఎంతో మంచి ఆసక్తి పెరిగింది.సూరి పాత్రకు( Soori ) శివ కంఠమనేని ఎంతో న్యాయం చేశారు.క్యాథలిన్ గౌడ తన నటనతో ఎంతో మంచిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక బాబ్జి పాత్ర( Babji ) కూడా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్:
ఈ సినిమా లవ్ అండ్ డ్రామా కామెడీ పొలిటికల్ నేపథ్యంలో అన్ని విధాలుగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు మలిచిన తీరు అద్భుతంగా ఉంది.ఇక మణిశర్మ సంగీతం( Manisharma ) సినిమాకు ఎంతో మంచి సక్సెస్ గా నిలిచిందని చెప్పాలి.బిజిఎం ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పాలి.ఫోటోగ్రఫీ విజువల్స్ సినిమాని మరింత ముందుకు నడిపించాయి.టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా అన్ని విధాలుగా ఎంతో మంచి సక్సెస్ అయింది.
విశ్లేషణ:
గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం అన్నిటికంటే కాస్త భిన్నంగా ఉందని చెప్పాలి.ఒకవైపు రాజకీయాలతో పాటు మరోవైపు కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని ఎంతో అద్భుతంగా మలిచారు.ఫస్ట్ అఫ్ కాస్త నిదానంగా సాగిన సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులకు ఆసక్తి కలిగించాయి.

ప్లస్ పాయింట్స్:
హీరో,హీరోయిన్ నటన, మ్యూజిక్, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు.
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ బోర్ కొట్టే కొన్ని సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగా సాగటం
బాటమ్ లైన్:
ఇలాంటి సినిమాలు ఇదివరకే వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసాము అన్న అనుభూతితో ప్రేక్షకులు బయటకు వస్తారు అని చెప్పాలి.