శివ ఆల‌పాటి, ప్రియాంక శ‌ర్మ‌ జంట‌గా నటిస్తున్న చిత్రం ‘డై హార్డ్‌ ఫ్యాన్‌’.

శివ ఆల‌పాటి, ప్రియాంక శ‌ర్మ‌ జంట‌గా నటిస్తున్న చిత్రం ‘డై హార్డ్‌ ఫ్యాన్‌’. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్‌ డైరెక్టర్‌ అభిరామ్ ఎం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కాగా ఈ చిత్రాన్ని శ్రీహన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ లో చంద్రప్రియ సుబుద్ధి నిర్మిస్తున్నారు.

 Siva Alapati And Priyanka Sharma Are Acting In The Movie 'die Hard Fan', Shakala-TeluguStop.com

స్టార్ హీరోస్ కి మాత్రమే కాకుండా హీరోయిన్స్ కి కూడా అభిమానులు ఉంటారు.సినిమా లో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అలాంటి ఓ అభిమాని త‌ను అభిమానించే హీరొయిన్ ని క‌ల‌వాల‌నుకుంటాడు.అనుకొకుండా హీరోయిన్ క‌లిస్తే ఆ రాత్రి ఏం జ‌రిగింద‌నేది ఈ చిత్ర ముఖ్య క‌థాంశం.

ఈ చిత్రానికి మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్నారు.తాజాగా ఈ చిత్రం నుండి “అరెరే కుదురే లేదే” అనే పాటను విడుదల చేసింది మూవీ టీం.హరిచరణ్ ఈ పాటను ఆలపించగా, లక్ష్మి ప్రియాంక సాహిత్యం అందించారు.“అరెరే కుదురే లేదే .కరిగే కాలానికే నిన్నే చూస్తూ ఇలా … క్షణమే చేజారిందే తారే నేరుగా … జారిందిలా నేలకే… నాకోసమే” అనే లైన్స్ ఆకట్టుకున్నాయి.! హరిచరణ్ ఆలపాన వినసొంపుగా ఉంది.

ఈ చిత్రంలో షకలక శంకర్‌, రాజీవ్‌ కనకాల, నోయల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు .ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన కాన్సెప్ట్‌ మోషన్‌ పోస్టర్‌కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ఆగస్టులో డై హార్డ్‌ ఫ్యాన్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయ‌ల్ తదితరులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube