పుకార్లు నిజం కాదన్న సీతారామం టీమ్‌

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన సీతారామం సినిమా ఈనెల 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా లో దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ జంటగా నటించగా రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర లో కనిపించబోతుంది.

ఈ సినిమా ను టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ నిర్మించడం వల్ల సినిమా ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగబోతుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం లో ప్రభాస్ హాజరు కాబోతున్నట్లు గా వార్తలు వచ్చాయి.అయితే ఇటీవల బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యొక్క అనుభవం దృష్ట్యా అభిమానులను ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం లేదంటూ ప్రభాస్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు అయ్యేందుకు గాను నిరాకరించాడని పుకార్లు షికార్లు చేశాయి.

కానీ తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రభాస్ రాబోతున్నాడు అంటూ అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గా కూడా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.

Advertisement

ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో హాజరు కాబోతున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశామంటూ దర్శక నిర్మాతలు ప్రకటించడం జరిగింది.పోలీసులు మరియు ఇతర శాఖల వారు కూడా ఈవెంట్ కి అనుమతించారని తెలుస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య కాలంలో మీడియా ముందుకు వచ్చింది లేదు.ఎట్టకేలకు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు రాబోతున్న నేపథ్యం లో అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ ఈ ఈవెంట్ లో ఏం మాట్లాడుతాడు.ఎలా మాట్లాడుతాడు.

అలాగే తన సినిమా ల గురించి ఏమైనా చెబుతాడా అనేది చూడాలి.ప్రభాస్ రాధేశ్యాం సినిమా నిరాశపరిచిన నేపథ్యం లో తదుపరి సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు