మహేష్ బాబు ఇంట క్రిస్మస్ వేడుకలు...ముందుగానే ప్రారంభించిన సితార?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి నటుడు మహేష్ బాబు( Mahesh Babu ) ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తే ఎంత బిజీగా ఉన్నారో ఈ క్రమంలోనే మహేష్ బాబు గారాల పట్టి సితార ( Sitara ) కూడా ఇండస్ట్రీలోకి రాకముందే ఈమె కూడా హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారనే విషయం మనకు తెలిసిందే.ఇంత చిన్న వయసులోనే మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నటువంటి సితార ప్రస్తుతం ఒకవైపు ఉన్నత చదువులు చదువుతూనే మరోవైపు సినిమా రంగంపై కూడా ఎంతో ఆసక్తిని కనుబరుస్తున్నారు.

 Sitara Started Christmas Celebration, Sitara , Mahesh Babu, Christmas Celeb-TeluguStop.com

ఈమె యూట్యూబ్ వీడియోస్ ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తూ రోజురోజుకు అభిమానుల సంఖ్య పెంచుకుంటూ పోతున్నారు.ఇక మహేష్ బాబు కుటుంబంలో అన్ని పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారనే విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే దసరా దీపావళి వంటి పండుగలను ఎంతో ఘనంగా జరుపుకోవడమే కాకుండా వాటికి సంబంధించినటువంటి ఫోటోలను సితార ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.ఇక డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ( Christmas Festival ) రానున్న నేపథ్యంలో సితార క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

ఇలా క్రిస్మస్ పండుగకు చాలా రోజులపాటు సమయం ఉంది.అయినప్పటికీ ఈమె తన ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసి క్రిస్మస్ ట్రీ( Christmas Tree ) ముందు శాంటా క్లాస్ క్యాప్ ధరించి క్రిస్మస్ పాటకు రీల్ చేసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను సితార సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ముందుగానే ఈమెకు అభిమానులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక సితార సోషల్ మీడియా వేదికగా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలకు డాన్స్ చేస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే.

https://www.youtube.com/watch?v=fYlB41emEbk
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube