దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఈ క్రమంలోనే సాధారణ ప్రజల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు కూడా వినాయక చవితి వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే మహేష్ బాబు ( Mahesh Babu ) ఇంట్లో కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయని చెప్పాలి.వినాయక చవితి పండుగ రోజు సితార ( Sitara ) దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అలాగే నమ్రత( Namrata ) కుటుంబం మొత్తం వినాయక చవితి పూజలో పాల్గొన్నటువంటి వీడియోని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇక తాజాగా వినాయక చవితి నిమజ్జనం ఉత్సవాలలో భాగంగా మహేష్ బాబు పిల్లలు సితార గౌతమ్ ( Gautham ) పాల్గొని సందడి చేశారు.తమ ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడిని తమ ఇంట్లో పని వాళ్ళతో కలిసి గౌతమ్ సితార నిమర్జనం కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఇక ఈ ఉత్సవాలలో మహేష్ నమ్రత ఎక్కడ పాల్గొనలేదు.
గౌతమ్ వినాయకుడు విగ్రహాన్ని ఎత్తుకొని ముందు నడుస్తూ ఉండగా వెనుక సితారతో పాటు పనివాళ్ళు కూడా వచ్చారు.అనంతరం సితార గౌతమ్ ఇద్దరూ కలిసి తమ ఇంటి పెరట్లో ఏర్పాటు చేసినటువంటి ఒక డ్రమ్ములో వినాయకుడి నిమర్జనం చేశారు.
ఇందుకు సంబంధించినటువంటి వీడియోని నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన మాతృభాష అయినటువంటి మరాఠీలో గణపతి బప్పా మోరియా.వచ్చే ఏడాది మళ్లీ రా అంటూ రాసుకు వచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్స్ ఈ వీడియో పై లైక్స్ కామెంట్స్ చేస్తున్నారు.గౌతమ్ ఇన్ని రోజులపాటు సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉన్నా, ఈ మధ్యకాలంలో ఈయన కూడా సోషల్ మీడియాలో చురుగ్గా కనిపిస్తున్నారు.
అలాగే సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు కూడా సంపాదించుకున్నారు.