Siri Hanumanth Srihaan: నేను అలా చెప్పినందుకు శ్రీహన్ సీరియస్ అయ్యాడు.. నా లైఫ్ లో చాలా ఇష్యూస్ అయ్యాయి: సిరి

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సిరి హనుమంత్ బాగా పరిచయం పెంచుకుంది.ఈమె ఒక యాంకర్ గా, నటిగా కంటే బిగ్ బాస్ హౌస్ లో తన పరిచయాన్ని పెంచుకుంది.

 Siri Hanumanth Shocking Comments On Srihaan In Ariyanas Bb Cafe Show Details, Sr-TeluguStop.com

ఈమె తొలిసారిగా తన కెరీర్ ను యాంకర్ గా మొదలు పెట్టింది.అంతేకాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ లలో కూడా నటించింది.

సిరి మొదటిసారి ఉయ్యాల జంపాల సీరియల్ తో నటిగా పరిచయమైంది.ఇక ఈ సీరియల్ తనకు మంచి గుర్తింపు ఇవ్వడంతో ఆ తర్వాత మోహిని, అగ్నిసాక్షి వంటి పలు సీరియల్స్ లలో అవకాశాలు అందుకొని అందులో కూడా మంచి పాత్రలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.

కేవలం బుల్లితెర పైనే కాకుండా యూట్యూబ్ లలో కూడా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరిస్ లు కూడా చేసింది.

సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్గా కనిపిస్తుంది.

ఈమె మరో ఆర్టిస్ట్ శ్రీహాన్ తో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.అతడు కూడా యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక వీరిద్దరూ కలిసి చాలా వీడియోస్ చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఇక ఈ హోదాతోనే గతంలో సిరి కి ఇప్పుడు శ్రీహాన్ కి బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది.

ప్రస్తుతం బిగ్ బాస్ లో శ్రీహాన్ బాగా సందడి చేస్తున్నాడు.దీంతో మంచి అభిమానం కూడా సంపాదించుకున్నాడు.కానీ సిరి మాత్రం తనకున్న అభిమానాన్ని మొత్తం బిగ్ బాస్ ద్వారా కోల్పోయింది.ఎందుకనేది.అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.సిరి హౌస్ లో ఉన్నంతకాలం మరో కంటెస్టెంట్, యూట్యూబర్ షణ్ముఖ్ తో బాగా రెచ్చిపోయింది కాబట్టి.

ఫ్రెండ్షిప్ అనే పేరుతో అతడికి హగ్గులు, కిస్ లు ఇచ్చి బాగా రచ్చ చేసి నెగెటివిటీ సంపాదించుకుంది.దీంతో అందరూ తనపై బాగా ఫైర్ అయ్యారు.అప్పటికే ఆమె శ్రీహన్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే.అయితే ఆమె అలా ప్రవర్తించడంతో అందరూ తనని ద్వేషించుకున్నారు.

ఇప్పటికీ ఆమె అంటే అంత అభిమానం చూపించలేకపోతున్నారు జనాలు.

అయితే ఇదంతా పక్కన పెడితే ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో శ్రీహన్ ను కలవడానికి సిరి వచ్చిన సంగతి తెలిసిందే.ఇక అందులో ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో పాటు ఇంట్లో వాళ్లతో బాగా సందడి చేసింది.అయితే తాజాగా సిరి యాంకర్ అరియానా హోస్ట్ చేస్తున్న బిబి కేఫ్ షో లో పాల్గొంది.

దానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.అందులో అరియానా అడిగిన ప్రశ్నలకు చాలా విషయాలు పంచుకుంది సిరి.

ఇక శ్రీహన్ చాలా మారిపోయాడు అది కూడా నువ్వే మార్చావు అంటూ అందరూ అంటున్నారు అని అరియానా అనడంతో.అలా ఏం లేదు అంటూ హౌస్ లోకి వెళ్ళినప్పుడు తను శ్రీహాన్ కు ఇండిపెండెంట్ గా ఉండమని ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అని సలహా ఇచ్చినప్పుడు శ్రీహన్ సీరియస్ అయ్యాడు అని తెలిపింది సిరి.

ఆ తర్వాత యూట్యూబ్లో సిరి, శ్రీహన్ పై వచ్చిన వార్తలను స్క్రీన్ పై చూపించడంతో అవి చూసి ఆశ్చర్యపోయింది సిరి.ఆ తర్వాత బ్రేకప్ అంటూ వచ్చిన వార్తపై కూడా స్పందిస్తూ.

తన లైఫ్ లో చాలా ఇష్యూస్ అయ్యాయి అంటూ తెలిపింది సిరి. ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube