Singer Janaki: ఫొటో తో మొదట ప్రేమలో పడి ఆ తర్వాత ఆయననే పెళ్లి చేసుకున్నాను : సింగర్ జానకి

ఎస్ జానకి అమ్మ…( Singer S Janaki ) 85 ఏళ్ల వయసులో పదహారేళ్ల అమ్మాయిల, పదేళ్ల పాపలా, 30 ఏళ్ల అమ్మాయిల, 85 ఏళ్ల వృద్ధిరాలుగా ఎలా అయినా సరే తన గొంతును సవరించే పాట పాడగల అరుదైన టాలెంట్ ఉన్న ఏకైక సౌత్ ఇండియన్ సింగర్. ఒక పాట పాడుతుంటే కోయిల కన్నా ఎంతో కమ్మగా పాడుతున్నట్టుగానే ఉంటుంది ఆమెను సౌత్ ఇండియా నైటింగేల్( South India Nightingale ) అని కూడా అంటూ ఉంటారు 1938లో పుట్టిన జానకమ్మ దాదాపు 50 వేలకు పైగా 17 భాషల్లో అనేక పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

 Singer Janakamma Love Story-TeluguStop.com

అయితే జానకమ్మ పాటల( Singer Janaki Songs ) గురించి మాత్రమే చాలామందికి తెలుసు కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొద్ది మందికే తెలుసు.ఆమె భర్త ఎవరు ? పిల్లలు ఎవరు ? అలాగే ఆమె పెళ్లి ఎలా జరిగింది ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.నిజానికి జానకి అమ్మ చిన్నతనంలో ఉన్నప్పుడు అంటే దాదాపు 15, 16 ఏళ్ల వయసులో స్టేజీపై పాటలు పాడుతూ ఉండేవారు.అక్కడ నాటకానికి నాటకానికి మధ్యలో ఆమెతో పాటలు పాడించేవారు.

Telugu Ram Prasad, Janaki-Movie

అలా ఒకరోజు తన మామగారికి సైతం ఆమె పాటలు పాడటానికి ప్రోగ్రాం కి వెళ్లారు.ఆయన రకరకాల వేషాలు వేసి లెజెండ్రీ పర్సనాలిటీస్ కి ఐదు నిమిషాలు చొప్పున గ్యాప్ తో మేకప్ మార్చుకొని అలాగే వేషం మార్చుకుని నటించి చూపించేవారు.అలా ఒక రోజు తన మామ గారి జేబులోంచి ఒక ఫోటో ( Photo ) కింద పడిపోతే అది చూసి ఆమె ఆ ఫోటోలోని వ్యక్తితో ప్రేమలో పడ్డారట.ఇది 1956 లో జరిగింది.

Telugu Ram Prasad, Janaki-Movie

ఆ వ్యక్తి మరెవరో కాదు తన భర్త ఫోటోనే అయితే అప్పటికే ఆ వ్యక్తి ఎవరో జానకమ్మకు( Janakamma ) తెలియదు ఫోటోతో మాత్రమే ప్రేమలో పడింది.ఆ తర్వాత ఓ రోజు నేరుగా ఆ వ్యక్తిని తన మామగారు పరిచయం చేశారట.అలా ఫోటోలో ప్రేమించిన వ్యక్తి నేరుగా కూడా ప్రేమించడం మొదలు పెట్టారట.ఆ తర్వాత ఆ ఫోటోలోని వ్యక్తి ఆమెను కూడా ప్రేమించడం మొదలుపెట్టి ఆమె పాటలను అమితంగా ప్రేమించే వారట.అలా జానకమ్మతో రామ్ ప్రసాద్( Ram Prasad ) వివాహం జరిగింది.1997లో 47 ఏళ్ల వైవాహిక జీవితం గడిచిన తర్వాత రామ్ ప్రసాద్ గుండెపోటుతో మరణించారు.

Telugu Ram Prasad, Janaki-Movie

అప్పటి వరకు కూడా జానకమ్మతోనే ఆయన జీవితం కొనసాగింది.ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమె వెంటే ఉండేవారు.ఆమె జీవితం మొత్తం రామ్ ప్రసాద్ మాత్రమే ఉన్నారు.కచేరి కి వెళ్ళిన, రికార్డింగ్ జరిగినా భర్త లేకుండా ఆమె ఎక్కడికి వెళ్ళింది లేదు.రామ్ ప్రసాద్ లేకుంటే నేను లేను అని చెబుతారు జానకి అమ్మ.వారి ప్రేమ అంతులేనిది అంటారు.

వీరికి ఒక కొడుకు పుట్టగా అతడు కూడా సింగర్ గానే తన కెరియర్ ను కొనసాగిస్తూ చెన్నైలో ప్రస్తుతం జీవిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube