ఆ రెండు మరణాలతో జీవచ్చవంలా సింగర్ చిత్ర..చివరికి కోమాలోకి !

ఆ నవ్వుల్లో అంతులేని విషాదం.ఆమె గొంతులో ఒక దుఃఖ సాగరం.

 Singer Chitra Life Incidents , Singer Chitra, Tollywood , Thiruvananthapuram , D-TeluguStop.com

ఆమె జీవితమే ఎప్పటికి మానని ఒక మౌన గాయం.సౌత్ ఇండియా మొత్తం దక్షిణ భారత నైటింగేల్ అని పిల్చుకునే సింగర్ చిత్ర అతి తక్కువ కాలంలో ఎన్నో సినిమాల్లో పాటలు ఆలపించి కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.1963 లో కేరళలోని తిరువనంత పురం లో చిత్ర జన్మించారు.ఆమె పూర్తి పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర.

చిన్న వయసు నుంచి కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి మలయాళ సినిమా ఇండస్ట్రీ లో తొలిసారి గా ప్రైవేట్ అల్బుమ్బ్స్ లో పాడి తన కెరీర్ ని ప్రారంభించింది.

ఆమె గానానికి అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు.

అంత సవ్యంగా సాగుతున్న సమయంలో ఆమె జీవితంలోకి పెను తుపాను లాగ వచ్చిన సంఘటన తన తండ్రి మరణం.ఆమెకు తండ్రి అంటే దేవుడి కన్నా కూడా ఎక్కువే.

చిత్రమ్మ తన తండ్రినే దేవుడిలా పూజించేది.అతడి మరణంలో ఆమె ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది.

ఆ విషాదం నుంచి బయటకు రావడానికి పాటలను ఆయుధంగా మలుచుకొని సంగీత ప్రపంచంలో ఆ గాయాన్ని మానేలా చేసుకుంది.ఆలా ఏకంగా భాషతో సంబంధం లేకుండా ఇరవై ఐదు వేల పాటలు పాడారు.

పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులతో దేశ ప్రభుత్వం ఆమెను సతక్రించింది.

Telugu Kerala, Nandhana, Padma Shri, Padma Vibhushan, Chitra, Vijay Shanker-Late

ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరియు వ్యాపార వేత్త అయినా విజయ శంకర్ ని 1988 లో వివాహం చేసుకున్న చిత్రమ్మకు 14 ఏళ్ళ పాటు పిల్లలు పుట్టలేదు.ఆ బాధ కొన్నాళ్లపాటు వేధించిన దేవుడి అనుగ్రహం తో నందన అనే అమ్మాయి పుట్టింది.కానీ పుట్టడమే డ్రోన్ సైన్డ్రోమ్ అనే వ్యాధితో జన్మించడం వల్ల ఆమెలో మానసిక ఎదుగుదల లేకుండా పోయింది.

కంటికి రెప్పలా తన కూతురిని కాపాడుకున్న కూడా ఎందుకో ఆ దేవుడికి మనసు ఒప్పలేదు.దుబాయ్ లో రెహ్మాన్ మ్యూజిక్ ట్రూప్ లో పాత పాడటానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఆ పాపా చనిపోయింది.

దాంతో చిత్రమ్మ బ్రతికి ఉన్న జీవచ్ఛవంలా మారిపోయింది.అక్కడితో ఆమె గుండె ఆగిపోయింది.ఆమె జీవితం ప్రశ్నార్థకంగా కనిపించింది.తల్లి గుండె తల్లడిల్లి ఏకంగా కోమాలోకి వెళ్ళింది.

తిరిగి మాములు మనిషి అవ్వడానికి ఏళ్ళ సమయం పట్టింది.ఆలా తండ్రి, కూతురు మరణం చిత్రమ్మ ను ఎంతగానో దహించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube