సింగర్ చిన్మయి.ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తరచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికీ ఈమె బాగా సుపరిచితమే.సింగర్ గా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న చిన్మయి మీటూ ఉద్యమం లో బాగా ధైర్యంగా మాట్లాడి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
అంతేకాకుండా సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి వేధింపుల గురించి తనతో తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.చాలామంది అభిమానులు కూడా వారికి వచ్చిన కష్టాన్ని చిన్మయితో చెప్పుకొని బాధపడుతూ ఉంటారు.
అయితే తోటి సింగర్ కార్తీక్ పై ఆమె లైంగిక ఆరోపణలు చేయగా ఆమెకు అండగా నిలిచింది.కార్తీక్ కూడా తనపై వచ్చిన ఆరోపణల్ని సింగర్ కార్తీక్ ఖండించిన విషయం తెలిసిందే.
తాజాగా ఇదే విషయం పై మరొకసారి స్పందించింది సింగర్ చిన్మయి.ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.
కార్తీక్ ఇష్యూలో సింగర్ మనో రాయబారం చేయడానికి చూశారని ఆమె తెలిపింది కార్తీక్ లైంగికంగా వేధిస్తున్నారని చాలామంది అమ్మాయిలు చెప్పారని,హైదరాబాద్, చెన్నైలతో పాటు స్విజర్లాండ్‌లో కూడా ఒక ఆమె కార్తీక్ గురించి చెప్పింది అని తెలిపింది.

అయితే తాను సింగర్ కార్తీక్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత సింగర్ మనో నాకు ఫోన్ చేశారు.ఎందుకమ్మా.నువ్వు కష్టపడి వచ్చావ్.
నువ్ ఇలా చేయడం వల్ల అతని కెరియర్ పాడౌతుంది అని రాయభారం చేసే ప్రయత్నం చేశారని అతను ఏం చేసినా పర్లేదు అనే స్టేజ్‌లో నేను లేను.మనో కార్తీక్ కీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్ధం కాలేదు.
పైగా కార్తీక్ నాకు సరిగమపలో కో జడ్జీగా కూడా ఉన్నారు అని చెప్పుకొచ్చింది సింగర్ చిన్మయి.అయితే నాకు విషయం తెలిసిన తరువాత ఏడుస్తూ ఉన్నాను.షూటింగ్‌కి కూడా టైంకి వెళ్లలేకపోయాను.కార్తీక్ నాకు ఫోన్ చేశాడు.
నేను నీతో ఏం మాట్లాడలేను అని ఫోన్ పెట్టేశానంటూ నాటి విషయాన్ని మళ్లీ గుర్తు చేసుకున్నారు సింగర్ చిన్మయి.







