ఆడపడుచు కట్నం అడిగారా అంటూ సింగర్ చిన్మయి పోస్ట్.. నెటిజన్స్ స్పందన ఏంటంటే?

టాలీవుడ్, కోలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి తెలియని వారే లేరని చెప్పాలి.తన గొంతుతో చాలా పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.

 Singer Chinmayi Post Viral On Dowry Details, Singer Chinmayi', Dowry, Netizens,t-TeluguStop.com

సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా చేసింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె ముక్కుసూటి మనిషిగా నిలిచింది.

సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది.ఎక్కువగా సమాజంలో జరిగే వ్యతిరేకత కు బాగా స్పందిస్తుంది.

సమాజంలో జరిగే అన్యాయాల గురించి, మహిళలపై, అమ్మాయిలపై జరిగే దాడుల గురించి బాగా స్పందిస్తుంది.నిజానికి ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ప్రతి ఒక్కరి బాధలను తెలుసుకొని వాటికి స్పందిస్తుంది.ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు తనకు తమ బాధలు గురించి చెబుతూ తమపై ఉన్న భారాన్ని తగ్గించుకున్నారు.

అప్పుడప్పుడు తన అభిమానులతో బాగా ముచ్చట్లు పెడుతుంది.అందులో చాలా మంది కొన్ని కొన్ని వ్యక్తిగత విషయాల గురించి, హెల్త్ టిప్స్ ల గురించి అడిగి సలహాలు తెలుసుకుంటారు.

హెల్త్ విషయంలో, బ్యూటీ విషయంలో కూడా నిత్యం ఏదో ఒక టిప్ చెబుతూనే ఉంటుంది చిన్మయి.నిజానికి చిన్మయి సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి అండగా ఉందనే చెప్పవచ్చు.

ఇక కొందరు మాత్రం ఈమెను బాగా ట్రోల్స్ చేస్తారు.

Telugu Chinmayi, Dowry, Kollywood, Netizens, Chinmayi Dowry, Tollywood-Movie

చాలా వరకు ఆమె ను టార్గెట్ చేసి ఆమెకు ప్రైవేట్ పార్ట్ ల ఫోటో లను కూడా పంపిస్తూ ఉంటారు.అయినా కూడా చిన్మయి అలా టార్గెట్ చేసేవారి గురించి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనేది.తిరిగి వారికి తన స్టైల్లో సమాధానమిస్తూ వారిని ముఖం చాటేసుకునేలా చేస్తుంది.

తనకు ఎవరైనా బూతు మాటలతో కామెంట్లు చేస్తే మాత్రం ఆ మాట తిరిగి వాళ్ళకే తగిలేలా చేస్తుంది.

ఇక ఈమె సోషల్ మీడియాని ఎక్కువగా జరిగే అన్యాయాలపై వాదించడానికి, వాటి సలహాలు ఇవ్వడానికి కోసమే ఎక్కువగా ఉపయోగిస్తుంది.

తక్కువ సందర్భాల్లో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది.అప్పుడప్పుడు బ్యూటీ కి సంబంధించిన టిప్స్ కూడా చెబుతూ ఉంటుంది.

Telugu Chinmayi, Dowry, Kollywood, Netizens, Chinmayi Dowry, Tollywood-Movie

ఇదంతా పక్కన పెడితే తాజాగా.తాను ఆడపిల్లల కట్నం గురించి టాపిక్ తీసింది.మిమ్మల్ని ఎవరైనా ఆడపడుచు కట్నం అడిగారా అంటూ తన ఫాలోవర్స్ ని ప్రశ్నించింది.దీంతో నెటిజన్స్ వెంటనే స్పందించారు.ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెప్పారు.కొందరేమో అడిగితేనే ఇస్తున్నాము అని.మరికొందరు ఇవ్వట్లేదు అని సమాధానాలు చెప్పారు.

ఇక కొంతమంది అసలు కట్నం ఇవ్వడమే పెద్ద తప్పు అంటూ.

అటువంటిది ఆడపిల్లల కట్నం కూడానా అంటూ కామెంట్లు పెడుతున్నారు.మొత్తానికి చిన్మయి చేసిన పోస్ట్ కు నెటిజన్స్ తమ ఒపీనియన్స్ తెలుపుతున్నారు.

ఇక ప్రస్తుతం చిన్మయి డబ్బింగ్, సింగింగ్ తో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా బిజీ బిజీగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube