తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగరేణి సంస్థల్లో రేపు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి.ఈ మేరకు రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
ఈ ఎన్నికల్లో సుమారు 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.కాగా 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి.
ఎన్నికల కోసం అధికారులు మొత్తం 11 ప్రాంతాల్లో 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.పోలింగ్ అనంతరం ఏరియాల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
అయితే రేపు 7వ సారి సింగరేణి ఎన్నికలు జరగనుండగా గతంలో మూడు సార్లు ఏఐటీయూసీ, మరో రెండు సార్లు టీబీజీకేఎస్ మరియు ఒకసారి ఐఎన్టీయూసీ విజయం సాధించాయి.