ప్లాంట్ నుంచి ప్రమాదకరమైన విషవాయువులు( Toxic Gas ) లీకైన విషయం తెలిసి కూడా విదేశీ కార్మికులను పనిచేయమని ఆదేశించినందుకు గాను సింగపూర్‌లోని( Singapore ) రిఫైనింగ్ కంపెనీలో సీనియర్ ఆపరేషన్స్ టెక్నీషియన్‌కు న్యాయస్థానం నాలుగు నెలల జైలు శిక్ష విధించింది.ఘటన జరిగిన సమయంలో సీనియర్ ఆపరేషన్స్ టెక్నీషియన్‌గా వున్న లెక్ చింగ్ హ్వా (47)( Leck Ching Hwa ) గత శుక్రవారం శిక్షను ఎదుర్కొన్నాడు.జురాంగ్ ద్వీపంలోని మెర్లిమావు రోడ్‌లోని చమురు శుద్ధి కర్మాగారంలో తాను నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆయన అంగీకరించాడు.
30 ఏళ్ల భారతీయుడు పళనివేల్ పాండిదురై( Palanivel Pandidurai ) సెప్టెంబర్ 17, 2020న కర్మాగారంలో విషవాయువుల కారణంగా చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అవయవ వైఫల్యంతో ఐదు రోజుల తర్వాత మరణించాడు.ఆ సమయంలో పీఈసీ అనే సంస్థలో పనిచేస్తున్న పళనివేల్, పెరియసామి, కొలంగినాథన్‌లు హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు ప్రభావానికి గురై కుప్పకూలిపోయారు.
వారి సహచరుడు నారయణన్ మురసోలి వారిని రక్షించేందుకు ప్రయత్నించి తను కూడా స్పృహతప్పి పడిపోయాడు.

ఈ ముగ్గురిని హుటాహుటిన టెంగ్ ఫాంగ్ జనరల్ ఆసుపత్రికి( Teng Fong General Hospital ) తరలించారు.పెరియసామి, నారాయణన్‌లకు కూడా తీవ్రగాయాలయ్యాయి.కానీ ప్రాణాలతో బయటపడినట్లు సోమవారం ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదిక పేర్కొంది.
కోర్టు పత్రాలు వారి జాతీయతలను , వయసును గురించిన వివరాలు వెల్లడించలేదు.హైడ్రోజన్ సల్ఫైడ్( Hydrogen Sulphide ) అనేది రంగులేని విషవాయువు.
ఇది కుళ్లిన కోడిగుడ్ల మాదిరిగా దుర్వాసనను వెదజల్లుతుంది.సాధారణంగా ముడి చమురు, సహజవాయువు ఉత్పత్తి కేంద్రాల్లో ఇది కనిపిస్తుంది.
దీనికి మండే గుణం కూడా వుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

పళనివేల్ శరీరంపై దాదాపు 40 శాతం కాలిన గాయాలు వున్నట్లు గుర్తించామని సింగపూర్ మానవశక్తి మంత్రిత్వ శాఖ ప్రాసిక్యూటింగ్ అధికారి మెల్విన్( Melvyn ) కోర్టుకు తెలిపారు.ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వున్న సమయంలో అవయవాల వైఫల్యం కారణంగా సెప్టెంబర్ 22, 2020న ప్రాణాలు కోల్పోయాడు.








