లాస్ట్ వర్కింగ్ డే .. భారత సంతతి ఎంపీకి సింగపూర్ పార్లమెంట్ గ్రాండ్ ఫెర్‌వేల్

రెండు దశాబ్ధాలకు పైగా ప్రజాసేవ చేసిన భారత సంతతి ఎంపీకి సింగపూర్ పార్లమెంట్ ఘనంగా వీడ్కోలు పలికింది.సీనియర్ మంత్రి థర్మన్ షణ్ముగరత్నాని( Tharman Shanmugaratnam )కి ఎంపీగా చివరి రోజు కావడంతో సభ్యులు ఉద్వేగానికి గురయ్యారు.సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను షణ్ముగరత్నం అన్ని రాజకీయ, ప్రభుత్వపరమైన పదవులకు రాజీనామా చేయనున్నారు.66 ఏళ్ల థర్మన్.తన సీనియర్ మంత్రి, సామాజిక విధానాల సమన్వయ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.అలాగే సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో( Singapore presidential election ) పోటీ చేసేందుకు గాను పీపుల్స్ యాక్షన్ పార్టీకి కూడా రాజీనామా చేయనున్నారు.

 Singapore Parliament Pays Tribute To Indian-origin Mp On His Last Day ,singapore-TeluguStop.com

జూలై 6న పార్లమెంట్‌లో తన చివరి రోజును గడిపారు థర్మన్.ఈ ఛాంబర్‌లో థర్మన్‌ను చాలా మిస్ అవుతామని హౌస్ లీడర్ ఇంద్రాణీ రాజా ఆవేదన వ్యక్తం చేశారు.

స్నేహితుడిని, తోటి పార్లమెంట్ సభ్యుడిని కోల్పోతామని ఆమె పేర్కొన్నారు.

థర్మన్ షణ్ముగరత్నం తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు గత నెల ప్రారంభంలో ప్రకటించి అందరికీ షాకిచ్చారు.1960ల నుంచి సింగపూర్‌ను పాలిస్తున్న పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ)( People’s Action Party )కి తాను రాజీనామా చేస్తున్నానని, రాజకీయాలతో పాటు ప్రభుత్వంలో వున్న అన్ని పదవుల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు తన నిర్ణయాన్ని సింగపూర్ ప్రధాని లీ సియన్ లూంగ్‌కు తెలియజేశారు.

మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (మాస్), జీఐసీ డిప్యూటీ ఛైర్మన్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఇంటర్నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్, మంత్రి తదితర హోదాల్లో షణ్ముగం పనిచేస్తున్నారు.

Telugu Indian Origin, Peoples, Singapore-Telugu NRI

ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన థర్మన్ షణ్ముగం.గతంలో సెంట్రల్ బ్యాంక్, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్‌లలో పనిచేశారు.తొలిసారిగా 2001లో జురాంగ్ జీఆర్‌సీ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.

సింగపూర్‌లో చైనీస్ సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఏరియాల్లో ఈ ప్రాంతం కూడా ఒకటి.దేశ ఉప ప్రధానిగా, ఆర్ధిక, విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన థర్మన్.2019 మే నుంచి సీనియర్ మంత్రిగా పదోన్నతి పొందారు.అలాగే సోషియల్ పాలసీలకు కో ఆర్టినేషన్ మినిస్టర్‌గా, ఆర్ధిక విధానాలపై ప్రధానికి సలహాదారుగా కూడా వ్యవహరించారు.

Telugu Indian Origin, Peoples, Singapore-Telugu NRI

సింగపూర్ ప్రజల కోరిక మేరకు తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు షణ్ముగం తెలిపారు.తన జీవితంలో ఇది అత్యంత కఠినమైన నిర్ణయమన్న ఆయన.ఈ విషయంపై తన కుటుంబాన్ని , సన్నిహితులను సంప్రదించానని ఆయన వెల్లడించారు.ప్రస్తుతం సింగపూర్ అధ్యక్షురాలిగా వున్న హాలీమా యాకూబ్ పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్‌ 13తో ముగియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube