ఈ నెల 9వ తేదీన థియేటర్లలో విడుదలైన ఒకే ఒక జీవితం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించింది.
రిలీజ్ రోజు నుంచి పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకుంటోంది.పరిమిత బడ్జెట్ తెరకెక్కినా ఒకే ఒక జీవితం సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయి.
అయితే ఒకే ఒక జీవితం సినిమా కథకు, ప్రాజెక్ట్ కే కథకు పోలికలు ఉన్నాయని సోషల్ మీడియా, వెబ్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమాకు ఒకే ఒక జీవితం సినిమాకు పోలికలు ఉన్నాయంటూ వైరల్ అయిన వార్తలు ప్రభాస్ అభిమానులను టెన్షన్ పెట్టాయి.అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి నాగ్ అశ్విన్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.

ప్యారడైజ్ వద్ద బస్సు దిగిన వారంతా బిర్యానీ తినరంటూ నాగ్ అశ్విన్ కామెంట్ చేయగా ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఒక్క కామెంట్ తో ఒకే ఒక జీవితం సినిమాకు ప్రాజెక్ట్ కే సినిమాకు ఎలాంటి పోలిక లేదని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చేశారు.నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇకనైనా ఈ తరహా వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.
ప్రాజెక్ట్ కే సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.వైజయంతీ మూవీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా భారీ సక్సెస్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశం అయితే ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.సినిమాసినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.







