నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్( Jr ntr ) పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా తారక్ ఫ్యాన్స్ కు ఆయన పుట్టిన రోజు నాడు సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా సెలెబ్రేషన్స్ చేసి హంగామా చేసారు.
అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా నుండి కూడా టైటిల్ రివీల్ చేయడంతో ఫ్యాన్స్ మరింత ఉత్సాహంలో ఉన్నారు.
ఇదిలా ఉండగా ఈయన పుట్టిన రోజు కానుకగా ఎన్టీఆర్ కెరీర్ లో సెన్సేషనల్ హిట్ అయిన సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు మరో సర్ప్రైజ్ ఇచ్చారు.
తాజాగా ఈ రీ రిలీజ్ కలెక్షన్స్ బయటకు వచ్చాయి.ఇప్పటి వరకు రిలీజ్ అయిన రీ రిలీజ్ సినిమాల్లో ఎన్టీఆర్ సింహాద్రి( Simhadri ) సంచలనం సృష్టించింది.
చరిత్రను తిరగరాసే కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.
సింహాద్రి ఎన్టీఆర్ కెరీర్ లో రిలీజ్ అయ్యి అప్పట్లోనే భారీ కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.మరి ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయినట్టు తెలుస్తుంది.రిలీజ్ చేసిన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ తెచ్చుకుని భారీ స్థాయిలో మొదటి రోజు కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.ఈ సినిమా వరల్డ్ వైడ్ గా పలు దేశాల్లో రిలీజ్ అవ్వగా మొత్తం కలిపి 6.02 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు అధికారికంగా తెలిపారు.
దీంతో ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాలేదు.దీంతో రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త సంచలనం నమోదు చేసాడు ఎన్టీఆర్.ఇప్పటి వరకు పవర్ స్టార్ ఖుషి రీ రిలీజ్( Kushi ) 4.15 కోట్ల వసూళ్లతో టాప్ లో ఉండగా ఈ సినిమా దీనిని క్రాస్ చేసింది.ఇక ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేయగా భూమిక హీరోయిన్ గా నటించింది.విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.అలాగే ఈమె ఈమె కీరవాణి సంగీతం అందించారు.