విశాఖ: సింహాచలం దేవస్థానం ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేసారు.మేము రబ్బరు స్టాంపులము కాదు.
అధికారులు ఎక్కడపడితే అక్కడ సంతకాలు అడిగితే పెట్టేయడానికి.?అభివృద్ధి పనులకు సంబంధించి ట్రస్ట్ బోర్డ్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.దానికి ముందు మాకు ముందుగా తెలియజేసి, అజండా ఇవ్వాలి?
గతంలో పెండింగులో ఉన్న బిల్లులు, ఇతర పనులపై సంతకాలు పెట్టమంటే మేమెలాగ పెడతాం.ఆనాడు మెట్లమార్గం పనులు 40 శాతం పూర్తయ్యాయి.
ఆ తరువాత పనులు నిలిపివేశారు.ఎందుకు ఆ పనులు ఆపారో నాకయితే అర్ధం కావడం లేదు.
అనేక విషయాలు ఉన్నాయి.తొందరు లో అన్ని బయట పడేతా.!
.






