విదేశీ గడ్డపై తొలి తెలుగు యూనివర్సిటీ “సిలికానాంధ్రా” కు 15 ఏళ్ళు పూర్తి

విదేశీ గడ్డపై ఓ తెలుగు వర్సిటీకి విశేష ఆదరణ లభించడం అక్కడి ప్రభుత్వంచే గుర్తించ బడటమే కాకుండా సుమారు 60 వేల మంది విద్యార్ధులను కలిగి ఉన్న ఓ విదేశీ బాషా వర్సిటీగా సిలికానాంధ్రా అగ్ర రాజ్యంలో చరిత్ర సృష్టించింది.2007 ఫిబ్రవరి 21 తేదీన అంటే సుమారు 15 ఏళ్ళ క్రితం అమెరికాలో స్థాపించబడిన సిలికానాంధ్రా ప్రస్తుతం అమెరికాలో అత్యున్నత ప్రమాణాలు ఉన్న వర్సిటీగా గుర్తింపు పొందింది.తెలుగు సంస్కృతీ , సాహిత్య, కళా సంపదలను భవిష్యత్తుతరాలకు అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా స్థాపించబడిన ఈ సంస్థ అనతికాలంలోనే ఎంతో ఆదరణ పొందింది.

 Silikanandra, The First Telugu University On Foreign Soil, Has Completed 15 Year-TeluguStop.com

అంతేకాదు అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో శాఖలు కూడా సిలికానాంధ్రాకు ఉన్నాయి, అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో సైతం సిలికానాంధ్రా తమ సంస్థలని స్థాపించింది.

ముందుగా సిలికానాంధ్రా మనబడి తో మొదలైన ఈ ప్రస్తానం మెల్లగా వర్సిటీగా రూపుదిద్దుకుంది.అమెరికాలో ఉండే తెలుగు ఎన్నారైల పిల్లలకు మాత్రు బాషను నేర్పుతూ కర్నాటక సంగీతం, కూచిపూడి, ఏంఏ స్థాయి కోర్సులు సైతం ప్రవేశ పెట్టింది.

తాజాగా సిలికానాంధ్రా ను స్థాపించి సుమారు 15 ఏళ్ళు గడుస్తున్న సమయంలో మాతృ బాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిలికానాంధ్రా వ్యవస్థాపక అధ్యక్షులు కూచిబొట్ల ఆనంద్ మనబడి చామర్తి రాజు అమెరికాలో, ఇతర దేశాలలో ఉన్న తెలుగు వారందరికీ, తమ సిలికానాంధ్రా విద్యార్ధులు, వారి తల్లి తండ్రులకు మాత్రు బాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్భంగా విద్యార్ధుల తల్లి తండ్రులు తెలుగు ఎన్నారైలు సిలికానాంధ్రా చేస్తున్న విద్యా సేవలను కొనియాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube