ఎన్నారైల కోసం సిలికాన్ ఆంధ్రా..వినూత్న కార్యక్రమం..

భారతీయ సాంప్రదాయాలు పద్దతులు , కళలు ఎంతో గొప్పవి ఎంతో మంది విదేశీయులు సైతం భారత్ వచ్చి మరీ మన కళలని నేర్చుకుని వెళ్తూ ఉంటారు.అయితే అమెరికాలో ఉంటున్న ఎంతో మంది తెలుగువారికోసం ఎంతో మంది కళలని నేర్చుకోవాలని అనుకునే వారి కోసం విద్యార్ధులను ప్రొత్సహిస్తూ, వారిని గొప్ప కళాకారులుగా సంగీత విద్వాంసులుగా చూడాలనే ఆశయంతో సిలికానాంధ్ర అమెరికా కెనడాలలో మరో వినూత్న కార్యక్రమం ప్రారంభించింది దాని పేరే ‘సంపద ‘ Silicon Andhra Music, Performing Arts and Dance Academy.

 Silicon Andhra Music Performing Arts Dance Academy-TeluguStop.com

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్దేశించిన పాఠ్యప్రణాళిక ప్రకారం కర్ణాటక సంగీతంలో గాత్రం, వయోలిన్, వీణ, వేణువు-ఫ్లూట్, మృదంగం, హిందుస్తానీ సంగీతంలో గాత్రం, వయొలిన్, సితార్, ఫ్లూట్, తబల, భారతీయ నాట్యాలలో భరతనాట్యం, కూచిపూడి, ఆంధ్ర నాట్యం తదితర కోర్సులలో, తొలిదశ 2సం ద్వారా జూనియర్ సర్టిఫికేట్ మలిదశ 2సం ద్వారా సీనియర్ సర్టిఫికేట్ పొందుతారు.అయితే మొదటి సంవత్సరమే సంపద లో 800 మంది విద్యార్ధులు నమోదు చేసుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తోందని, తెలిపారు సిలికానాంధ్ర సంపద అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు.

అయితే త్వరలోనే వీరికి పరీక్షలు సైతం నిర్వహిస్తామని ఈ పరీక్షల నిర్వహణలో అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సిలికానాంధ్ర సాంస్కృతిక సైనికులు సహకారం అందించారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.2018-19 విద్యాసంవత్సరపు ప్రవేశాలు మే 15న ప్రారంభమౌతున్నాయని, సంపద గురించిన మరిన్ని వివరాలకు, కొత్త విద్యా సంవత్సరంలో నమోదు కొరకు sampada.siliconandhra.org సంప్రదించవచ్చని తెలిపారు సిలికానాంధ్ర నిర్వాహకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube