Sikh Musician Raj Singh : అమెరికాలో సిక్కు సంగీతకారుడి కాల్చివేత .. గురుద్వారా సమీపంలోనే ఘటన

అమెరికాలో దారుణం జరిగింది.సిక్కు కీర్తన బృందంలో సభ్యుడైన 29 ఏళ్ల సంగీతకారుడిని శనివారం అలబామా రాష్ట్రంలోని( Alabama State ) సెల్మా వద్ద గురుద్వారా వెలుపల కాల్చిచంపారు.

 Sikh Musician Shot Dead Outside Gurdwara In Us State Of Alabama-TeluguStop.com

మృతుడిని రాజ్ సింగ్,( Raj Singh ) గోల్డీ( Goldy ) అని కూడా పిలుస్తారు.ఆయన యూపీలోని బిజ్నోర్ జిల్లాలోని తండా సాహువాలా గ్రామానికి చెందివాడు.

ఆయన గడిచిన ఏడాదికి పైగా తన సంగీత బృందంతో అమెరికాలో వుంటున్నాడు.గోల్డీ గురుద్వారా బయట నిలబడి వుండగా.

గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి పరారయ్యారు.రాజ్ సింగ్ మరణవార్తను కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

ఘటనపై రాజ్ సింగ్ బావ గుర్దీప్ సింగ్ మాట్లాడుతూ.పోస్ట్‌మార్టం ఇంకా నిర్వహించాల్సి వుందన్నారు.తాము మరింత సమాచారం కోసం గురుద్వారా కమిటీని సంప్రదించామని వారు సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు.రాజ్ సింగ్ మరణానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

అయితే రాజ్ సింగ్ హత్య వెనుక జాతి విద్వేషం లేదని సెల్మా పోలీసులు తెలిపారు.

Telugu Alabama, Gurdwara, Hate, Singh, Rajsingh, Selma, Sikh Musician, Sikhmusic

ఇకపోతే.గతేడాది న్యూయార్క్ నగరంలో భారత సంతతికి చెందిన సిక్కు వృద్ధుడు జస్మర్ సింగ్‌ (66)పై( Jasmer Singh ) జరిగిన జాతి విద్వేష దాడి తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.‘‘ టర్బన్ మ్యాన్ ’’( Turban Man ) అని పిలుస్తూ వృద్ధుడిపై దుండగుడు విచక్షణారహితంగా దాడి చేసి ఆయన మరణానికి కారణమయ్యాడు.

ఈ నేరానికి సంబంధించి నిందితుడిపై నరహత్య, దాడి, ద్వేషపూరిత నేరం అభియోగాలు మోపినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.

Telugu Alabama, Gurdwara, Hate, Singh, Rajsingh, Selma, Sikh Musician, Sikhmusic

ఈ ఘటనకు సంబంధించి రంగంలోకి దిగిన పోలీసులు అక్టోబర్ 20న నిందితుడు గిల్బర్ట్ అగస్టిన్‌ను( Gilbert Augustin ) అరెస్ట్ చేశారు.ఇతనిపై నరహత్య, దాడి అభియోగాలు మోపినట్లు డైలీ న్యూస్ నివేదించింది.అక్టోబర్ 19న క్యూ గార్డెన్స్‌లోని హిల్‌సైడ్ అవెన్యూ సమీపంలో వాన్ విక్ ఎక్స్‌ప్రెస్ వేపై ( Van Wyck Expressway ) సింగ్.

అగస్టిన్ వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి.రెండు కార్లపై గీతలు వున్నట్లుగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై సింగ్ 911కి కాల్ చేస్తుండగా .అగస్టిన్ అతని చేతిలోని ఫోన్ లాక్కున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.ఈ వాగ్వాదం ముగిశాక.సింగ్ తన ఫోన్‌ను తీసుకునేందుకు గాను అతనిని అనుసరించాడు.

Telugu Alabama, Gurdwara, Hate, Singh, Rajsingh, Selma, Sikh Musician, Sikhmusic

ఎట్టకేలకు తన ఫోన్ సంపాదించి తన కారు దగ్గరికి వెళ్తున్న సింగ్‌ను అగస్టిన్ వెనుక నుంచి తల, ముఖంపై పదే పదే కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.దీంతో సింగ్ నేలపై కూలిపోయాడు.అయినప్పటికీ అగస్టిన్ అతనిని వదిలిపెట్టకుండా కొడుతూనే వున్నాడు.కొద్దిసేపటికి తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి రెండు మైళ్ల దూరంలోనే అగస్టిన్‌ను అరెస్ట్ చేశారు.అతని వద్ద సస్పెండ్ చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్ వుందని, అలాగే అతని అలబామా లైసెన్స్ ప్లేట్, న్యూయార్క్ రిజిస్ట్రేషన్‌తో సరిపోలలేదని పోలీసులు గుర్తించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube