హైదరాబాద్‌ లో డబుల్‌ టోన్డ్‌ ఏ2 బఫెలో మిల్క్‌ ను పరిచయం చేసిన సిద్స్‌ ఫార్మ్‌

హైదరాబాద్‌, 04 మే 2022 : తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహి స్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్‌ , సిద్స్‌ ఫార్మ్‌ తమ ఉత్పత్తి ఫోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరిస్తూ డబుల్‌ టోన్డ్‌ ఏ2 బఫెలో మిల్క్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది.ముందు హైదరాబాద్‌లో విడుదల చేసిన అనంతరం మిగిలిన నగరాలకు విస్తరించనున్నారు.

 Sid’s Farm Introduces Double Toned A2 Buffalo Milk In Hyderabad, Sid’s Farm,-TeluguStop.com

ఈ డబుల్‌ టోన్డ్‌ ఏ2 బఫెలో 500 మిల్లీ లీటర్‌ మిల్క్‌ ధర 40 రూపాయలు.కేలరీల పట్ల అమిత శ్రద్ధ చూపడంతో పాటుగా డైటరీ నిబంధనలు అనుసరించే వారిని లక్ష్యంగా చేసుకుని దీనిని విడుదల చేశారు.

సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘మా వినియోగదారులు ఎంతోకాలంగా మా గేదె పాలను అమితంగా అభిమానిస్తున్నారు.ఈ పాలలో వెన్న శాతం అధికంగా ఉంటుంది.

వారు తమ రోజువారీ వినియోగం కోసం అతి తక్కువ కొవ్వు కలిగిన పాలను కోరుకుంటున్నారు.వారి కోరికకునుగుణంగా ఈ పాలను విడుదల చేస్తున్నాం.

త్వరలో మేము విడుదల చేయబోయే ఎన్నో ఉత్పత్తి ఆవిష్కరణలలో ఇది మొదటిది’’అని అన్నారు.ఈ డబుల్‌ టోన్డ్‌ బఫెలో మిల్క్‌లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కానీ స్వచ్ఛమైన గేదె పాల చక్కదనం మాత్రం ఉంటుంది.

అత్యధిక పోషక విలువలు కలిగి ఉండేలా ఈ పాలను సమృద్ధి చేశారు.షాప్స్‌, ఫిజికల్‌ ఔట్‌లెట్లతో పాటుగా డబుల్‌ టోన్డ్‌ ఏ2 బఫెలో మిల్క్‌ ఇప్పుడు సిద్స్‌ ఫార్మ్‌ యాప్‌ పై కూడా హోమ్‌ డెలివరీకి అందుబాటులో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube