ఇంగువను రెగ్యుల‌ర్‌గా తీసుకుంటున్నారా? అయితే జ‌ర జాగ్ర‌త్త‌!

వంట‌ల‌కు అద్భుత‌మైన రుచి, వాస‌న‌ను అందించ‌డంలో ఇంగువ‌ది ప్ర‌త్యేక‌మైన స్థానం అన‌డంలో సందేహ‌మే లేదు.అందుకే కొంద‌రు ఇంగువ‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకుంటారు.

పైగా ఇంగువ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.జ్ఞాప‌క శ‌క్తిని పెంచ‌డంలోనూ, అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ, మ‌ధుమేహం వ్యాధిని అదుపు చేయ‌డంలోనూ, మూత్ర పిండాల స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలోనూ ఇంగువ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

అయితే ఆరోగ్యానికి ఎన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందించిన‌ప్ప‌టికీ.ఇంగువ‌ను ప‌రిమితికి మించి తీసుకుంటే మాత్రం అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

సాధార‌ణంగా గ్యాస్‌, అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంతో ఇంగువ చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.కానీ, అదే ఇంగువ‌ను ఓవ‌ర్ తీసుకుంటే మాత్రం గ్యాస్‌, అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం, గుండెల్లో మంట త‌దిత‌ర‌ జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు మ‌రింత ఎక్కువ అయ్యే ప్ర‌మాదం ఉంటుంది.

Advertisement
Side Effects Of Taking Asafoetida Overly! Asafoetida, Side Effects Of Asafoetida

అలాగే ఇంగువ ఆరోగ్యానికి మంచిదే.కానీ, ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో మాత్రం దాన్ని ఎవైడ్ చేయ‌డ‌మే మంచిది.

ఎందుకంటే, ఇంగువ ఒక్కోసారి గ‌ర్భ‌స్రావానికి దారి తీసేలా చేస్తుంది.Side Effects Of Taking Asafoetida Overly Asafoetida, Side Effects Of Asafoetida

ర‌క్త పోటును త‌గ్గించ‌డంలో ఇంగువ సూప‌ర్‌గా హెల్ప్ చేస్తుంది.అయితే లో బీపీతో త‌ర‌చూ బాధ ప‌డే వారు ఇంగువ‌ను తీసుకుంటే.ర‌క్త పోటు స్థాయిలో మ‌రింత ప‌డిపోయి అనేక స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

కామ‌ట్టి, లో బీపీ ఉన్న వారు ఇంగువ‌కు దూరంగా ఉండ‌ట‌మే మేలు.ఆరోగ్యానికి మంచిద‌ని అధికంగా ఇంగువ‌ను వినియోగిస్తే క‌ళ్లు తిర‌గ‌డం, తీవ్ర‌మైన త‌ల నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌కు గురి కావాల్సి ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అంతే కాదు, ఇంగువ‌ను ప‌రిమితికి మంచి యూజ్ చేస్తే గ‌నుక‌.నాడీ వ్య‌వ‌స్థ ప్ర‌భావితం అవుతుంది.

Advertisement

వాంతులు, వికారం, చికాకు వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.మ‌రియు చ‌ర్మ ఎల‌ర్జీలు సైతం త‌లెత్తుతాయి.

అందుకే ఆరోగ్యానికి ఎన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందించిన‌ప్ప‌టికీ.ఇంగువ‌ను ఎంత ప‌రిమితంగా వాడితే ఆరోగ్యానికి అంత మంచిది.

సో.ఇంగువ‌తో జ‌ర జాగ్ర‌త్త‌.!.

తాజా వార్తలు