హెల్త్‌కి మేల‌ని పుచ్చ‌కాయ‌ను అతిగా లాగిస్తే రిస్క్‌లో ప‌డ‌టం ఖాయం!

ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ఎక్క‌డ చూసినా పుచ్చ‌కాయ‌లే ద‌ర్శ‌న‌మిస్తూ ఉంటాయి.తిన‌డానికి చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే పుచ్చ‌కాయ‌ల‌ను పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ అమితంగా ఇష్ట‌ప‌డుతుంటారు.

 Side Effects Of Eating Watermelon Overly! Side Effects Of Watermelon, Watermelon-TeluguStop.com

అలాగే పుచ్చ‌కాయలో కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, జింక్‌, మాంగ‌నీస్‌, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, ప్రోటీన్‌, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు మెండుగా నిండి ఉంటాయి.అలాగే వాట‌ర్ కంటెంట్ కూడా పుచ్చ‌కాయ‌లో పుష్క‌లంగా ఉంటుంది.

అందుకే వేస‌వి తాపాన్ని తీర్చుకునేందుకు, శ‌రీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకునేందుకు పుచ్చ‌కాయను త‌ర‌చూ తీసుకుంటారు.అయితే పుచ్చ‌కాయ హెల్త్‌కి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ అతిగా లాగిస్తే మాత్రం రిస్క్‌లో ప‌డ‌టం ఖాయం.

అస‌లింత‌కీ పుచ్చ‌కాయ‌ను అతిగా తీసుకుంటే ఏయే స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్త‌వానికి పుచ్చ‌కాయ‌లో వాట‌ర్ కంటెంట్‌తో పాటు స‌హ‌జ చ‌క్క‌లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి.అందువ‌ల్ల‌, దీనిని ఓవ‌ర్‌గా తీసుకుంటే బ‌రువు పెరిగే అవ‌కాశాలు ఉంటాయి.అందులోనూ రాత్రి స‌మ‌యంలో పుచ్చ‌కాయ‌ను తీసుకుంటే వెయిట్ గెయిన్ అయ్యే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌ని నిపుణులు చెబుతున్నారు.అలాగే పుచ్చకాయను మోతాదుకు మించి తీసుకోవ‌డం వ‌ల్ల బ్లెడ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపు త‌ప్పుతాయి.

క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, పొత్తి క‌డుపు నొప్పి, తీవ్ర‌మైన అసౌక‌ర్యం వంటి స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.ఒక్కోసారి డయేరియాకు కూడా గురి కావాల్సి ఉంటుంది.

Telugu Watermelon, Tips, Latest-Telugu Health Tips

అంతేకాదు, పుచ్చ‌కాయ‌లో పొటాషియం కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది.అందు వ‌ల్ల‌, దీనిని అతిగా లాగించేస్తే మూత్ర‌పిండాలు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయి.ఒక‌వేళ‌ కిడ్నీ వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న వారైతే ఖ‌చ్చితంగా వైద్యుల‌ను సంప్ర‌దించాకే పుచ్చ‌కాయ‌ను తీసుకోవాలి.ఇక పుచ్చ‌కాయ‌ను ప‌రిమితికి మించి తిన‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు స్థాయిలు సైతం పెరిగే అవ‌కాశాలు ఉంటాయి.

అందుకే పుచ్చ‌కాయ‌ను లిమిట్‌గా తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube