ఓలా కంపెనీ టూవీలర్లను కొనవద్దని ఓ వ్యక్తి విచిత్ర నిరసన..చూస్తే షాక్..

అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో ప్రమాదం పొంచివుంటుంది.ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన పలు ఎలక్ట్రిక్‌ వాహనాలలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

 Maharashtra Man Strange Protest Against Ola Company Two Wheelers Details, Mahara-TeluguStop.com

బ్యాటరీ పేలుడు, ఇతర సమస్యలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే చెన్నై, ఇతర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల్లో పేలుడు సంభవించగా, ఇక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారీ సంస్థ ఫ్యూర్‌ కంపెనికి చెందిన స్కూటర్‌ బ్యాటరీ పేలుడు సంభవించింది.

నిజామాబాద్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్యాటరీని చార్జింగ్‌ పెట్టగా, ఒక్కసారిగా పేలడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనపై ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మధ్య తరచూ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు పేలిపోయి, కాలిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం.ఇది అలాంటిది కాకపోయినా మరో రకం.మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఓలాని ఎంతో ఆశపడి కొనుక్కున్నాడు.అతని పేరు సచిన్ గిట్టే.

బీడ్ జిల్లాకు చెందినవాడు.కొన్న కొన్ని రోజులకే ఆ స్కూటర్ పనిచేయడం మానేసింది.

దాన్ని గాడిదను కట్టిన ఆయన.దాన్ని రోడ్లపై తీసుకెళ్లాడు.ఇలాంటి కంపెనీలతో జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక సందేశాలను స్కూటర్‌కీ, గాడిదకూ వేలాడదీశాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌‌ని… తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ లెట్సప్ మరాఠీలో ఏప్రిల్ 25, 2022న షేర్ చేసింది.

Telugu Maharashtra, Olacompany, Olaelectric, Gitte, Gitter Ola Bike, Strange-Lat

ఆ వీడియోని ఇప్పటికే లక్షల మంది చూడగా… 13 వేల మందికి పైగా లైక్ చేశారు.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొన్ని ఆరు రోజులకే అది పనిచేయడం మానేసింది.ఆ విషయాన్ని ఓలా మెకానిక్‌కి చెప్పగా… వచ్చి చెక్ చేస్తామని చెప్పారట.కానీ ఎవరూ రాలేదు.ఎన్నోసార్లు కస్టమర్ కేర్ ప్రతినిధులకు కాల్ చేసినా… వారు సరైన సమాధానం ఇవ్వలేదని బాధితుడు చెబుతున్నాడు.కంపెనీపై ఆగ్రహంతోనే తాను ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

ఓలా కంపెనీ టూవీలర్లను కొనవద్దని అతను కోరుతున్నాడు.

Telugu Maharashtra, Olacompany, Olaelectric, Gitte, Gitter Ola Bike, Strange-Lat

సచిన్ గిట్టే ఓ వ్యాపారి.అసలే పెట్రోల్ ధరలు బాగా పెరిగిపోయాయనే ఉద్దేశంతో… ఎలక్ట్రిక్ స్కూటరైతే ఎక్కువ మైలేజ్, తక్కువ ఖర్చు అవుతుందని ఇష్టపడి 2021 సెప్టెంబర్‌లో ఓలా స్కూటర్ బుక్ చేశాడు.అది మార్చి 24, 2022న డెలివరీ అయ్యింది.

తీరా చూస్తే అది పనిచేయట్లేదు.దీనిపై అతను కంప్లైంట్ రిజిస్టర్ చేశాడు కూడా.

అయినా కంపెనీ నుంచి స్పందన లేదు.రిపేర్ గానీ, రీప్లేస్‌మెంట్ గానీ చెయ్యలేదని బాధితుడు చెబుతున్నాడు.

దీనిపై ప్రభుత్వాలు పట్టించుకొని… దర్యాప్తు జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని అతను కోరుతున్నాడు.

Telugu Maharashtra, Olacompany, Olaelectric, Gitte, Gitter Ola Bike, Strange-Lat

ఓలా కంపెనీపై ఈమధ్య కంప్లైంట్లు ఎక్కువయ్యాయి.ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు తరచూ కాలిపోతున్నాయి.ప్రస్తుతం కంపెనీ సర్వీస్ ఇంజినీర్లు ఈ స్కూటర్లను మళ్లీ పరిశీలిస్తున్నారు.

అన్ని ఓలా స్కూటర్లకూ బ్యాటరీలు, థెర్మల్, సేఫ్టీ వ్యవస్థల్ని చెక్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో తేడా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మొన్ననే హెచ్చరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube