కేఫ్ కాఫీ డే సిద్దార్ద్ గురించి బయట పడుతున్న సంచలన నిజాలు

కేఫ్ కాఫీ డేకి దేశ వ్యాప్తంగా ఒక బ్రాండ్ ఉంది.దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్టోర్స్ ని ఏర్పాటు చేసి వేల కోట్ల వ్యాపారం చేస్తున్న కాఫీ డే అధినేత సిద్దార్ద్ కొద్ది రోజుల క్రితం మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.

 Siddhartha Holding Companies Had Over Rs 3500 Crore Debt-TeluguStop.com

అయితే అతని మరణం తర్వాత రాజకీయ నాయకులు నుంచి సామాన్యులు, వ్యాపారులు వరకు ప్రభుత్వంపై వేలెత్తి చూపించారు.సిద్ధార్ద్ మరణం వ్యవస్థ చేసిన మర్డర్ గా అభివర్ణించారు.

ప్రభుత్వం ఐటీ మాటున బడా వ్యాపారస్తులని టార్గెట్ చేయడంతో అప్పులపాలై దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ విమర్శించారు.అయితే అతని ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్న, మరణం తర్వాత కాఫీ డే మీద ఐటీ అధికారులు తమ స్టైల్ లో ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు.

దీనిలో ఐటీ అధికారులకి షాకింగ్ నిజాలు తెలిసాయి.కేఫ్ కాఫీడేకు చెందిన ఉద్యోగులు, ఉన్నతాధికారులు కొందఱు రైతులమని నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల వద్ద నుంచి ఏకంగా 145 కోట్లు అడ్డదారిలో అప్పులుగా తీసుకున్న విషయం బయటకు వచ్చింది.

ఈ విషయాన్ని తాజాగా ఆదాయపన్ను అధికారులు గుర్తించారు.సిద్దార్థ మరణం తర్వాత ఆయన ఆర్థిక విషయాలకు సంబంధించిన వివరాల్ని ఐటీ అధికారులు క్రాస్ చెక్ చేయటంతో ఈ విషయాలు బయటపడ్డాయి.

కేఫ్ కాఫీడే ఉద్యోగులు అన్నదాతల పేరుతో నకిలీ పత్రాలు సమర్పించి కోట్లాది రూపాయిలు రుణాలు తీసుకొని వాటిని సిద్దార్థకు చెందిన ఇతర కంపెనీలకు తరలించినట్లు గుర్తించారు.తమకి కాఫీ తోటలు ఉన్నాయని నకిలీ ద్రువపత్రాలు సృష్టించి ఈ మోసానికి తెరతీసారని తెలుసుకున్నారు.

త్వరలో వీటిపై పూర్తి ఆధారాలు బయటపడిన తర్వాత బయటపెట్టి తమపై పెట్టడానికి ఐటీ అధికారులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube