రహస్య నిశ్చితార్థం పై స్పందించిన హీరో సిద్ధార్థ్.. ఏమన్నారంటే?

సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అయినటువంటి సిద్ధార్థ్ ( Siddharth ) ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే ఈయన సినిమాలో పరంగా కంటే ఇటీవల కాలంలో తన వ్యక్తిగత విషయాల ద్వారానే వార్తలలో నిలిచారు.

 Siddharth Open Up His Marriage With Aditi Rao Hydari , Siddharth, Aditi Rao Hyda-TeluguStop.com

తెలుగులో కూడా ఎన్నో మంచి సినిమాలలో నటించి మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి సిద్ధార్థ్ నటి అదితి రావ్ హైదరీ ( Aditi Rao Hydari ) తో ప్రేమలో ఉన్నారు అంటూ ఇదివరకు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Telugu Siddharth, Siddharthaditi-Movie

ఇకపోతే ఈ జంట ఇటీవల తెలంగాణలోని ఓ ఆలయంలో నిశ్చితార్థం జరుపుకున్నారు.ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం ( Engagment ) జరుపుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

ఇలా రహస్యంగా నిశ్చితార్థం జరుపుకోవడం పట్ల ఇటీవల హీరో సిద్ధార్థ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.మేము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని చాలా మంది అనుకుంటున్నారు.సీక్రెట్, ప్రవేట్ అనే పదాలకు చాలా తేడా ఉందని ఈయన తెలిపారు.

Telugu Siddharth, Siddharthaditi-Movie

మేము మా ఎంగేజ్మెంట్ కి ఎవరినైతే పిలవలేదో వారందరూ కూడా ఇది సీక్రెట్ ఎంగేజ్మెంట్ అని అనుకుంటున్నారు.నిజం చెప్పాలంటే ఈ ఎంగేజ్మెంట్ మా కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ గా జరిగిందని సిద్ధార్థ్ తెలిపారు.ఇక మీ ప్రపోజల్ ఓకే చేయడానికి అదితి ఎన్ని రోజుల సమయం తీసుకుందనే ప్రశ్న కూడా ఈయనకు ఎదురయింది.

ఈ ప్రశ్నకు సిద్ధార్థ్ సమాధానం చెబుతూ ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగద్దు ఆమె చేసి చెబుతుందా లేదా నో చెబుతుందా అనేది ఫైనల్ రిజల్ట్.అయితే ఆమె ఏం చెబుతుందా అనే విషయం గురించి టెన్షన్ పడ్డానని ఆమె ఎస్ చెప్పడంతో నా పేరు పాస్ లిస్ట్ లోకి వెళ్ళింది అంటూ ఈ సందర్భంగా సిద్ధార్థ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube