సాయిబాబాని ఎవరు పూజించాలి? ఎలా పూజించాలి?

గురువారం నాడు సాయినాథుని ప్రార్థన చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం.అసలు గురువారం నాడు ఈ ప్రార్థన, పూజలు ర‌క‌ర‌కాలుగా చేస్తుంటారు.

ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తారు. సాయినాథుని పటాన్ని, విగ్రహాన్ని పెట్టి  ఆ తర్వాత నుదిటిపై చందనాన్ని, తిలకాన్ని దిద్ది పూలు సమర్పిస్తారు.

ఆ తర్వాత దీప స్తంభంలో సాయిజ్యోతిని వెలిగించాలి.అటు తర్వాత సాంబ్రాణి, అగరు వత్తులు వెలిగించి .చెక్కర, మిఠాయి, పండ్లు వంటి వాటిని నైవేద్యంగా పెట్టాలి.శాస్త్రాల ప్రకారం సాయి బాబాకు దీపారాధన చేస్తే బుద్ధి బలం కలిగి పాపాలు నశిస్తాయి.

సాయి బాబాకు దూపం వేయడం వల్ల ధనం ప్రాప్తి కలుగుతుంది.మనసులోని చెడు ఆలోచనలు నశించి సన్మార్గం వైపు ప్రయణిస్తారు.

Advertisement
Siababa Special Story, Saibab, Pooja , Devotinal Shiridi Sai-సాయిబా

షిరిడి సాయికి గంధం సమర్పిస్తే పుణ్యం కలుగుతుంది.పూజ చేస్తున్న భక్తుడు లేదా భక్తురాలు ఒకేపూట భోజనం చేయాలి.

అంతేతప్ప కడుపు మాడ్చుకుని మరీ సాయిబాబాను కొలువరాదు.పూజ చేసిన తర్వాత నైవేద్యాన్ని తినాలి.

ఇలా తొమ్మిది గురువారాలు సాయినాథుడికి పూజ చేస్తే మంచి ఫలితం దక్కుతుంది.

Siababa Special Story, Saibab, Pooja , Devotinal Shiridi Sai

సాయిబాబాని కేవలం హిందువులే కాదు ముస్లింలు కూడా కొలుస్తారు.ఎందుకంటే సాయిబాబా మసీదులో నివసించారు.చివరకు గుడిలో సమాధి అయ్యారు.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!

బాబా రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు.ఈయన రెండు సంప్రదాయాల పదాలను, చిత్రాలను ఉపయోగించారు.

Advertisement

ఆయన అందరికీ దేవుడొక్కడే అని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు.హిందువులు సాయినాథుడిని శివుడు, దత్తాత్రేయుడి రూపం అయిన సద్గురుగా భావించేవారు.

తాజా వార్తలు