భారత్-వెస్టిండీస్ తొలి మ్యాచ్ లో తొలి టెస్ట్ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్, యశస్వి జైస్వాల్ లతోపాటు మహమ్మద్ సిరాజ్, శుభ్ మన్ గిల్ లు కూడా అందరిని ఆకట్టుకున్నారు.మహమ్మద్ సిరాజ్( Mohammad Siraj ) గాల్లోకి ఎగిరి కళ్ళు చెదిరే క్యాచ్ పట్టుకొని వెస్టిండీస్ కు షాక్ ఇచ్చాడు.
శుభ్ మన్ గిల్ ( Shubmangill ) అదిరిపోయే స్టెప్పులు వేసి కాస్త సందడి చేశాడు.తొలి రోజు వెస్టిండీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించి భారత ఆటగాళ్లు తెగ ఎంజాయ్ చేశారు.
మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 64.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాణించారు.

అయితే భారత జట్టు పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టుకొని అందరినీ ఆశ్చర్యపరచాడు.రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) వేసిన 28వ ఓవర్ చివరి బంతికి వెస్టిండీస్ బ్యాటర్ బ్లాక్ వుడ్ మిడాఫ్ భారీ బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు.బౌండరీ వద్ద వెనుకకు పరిగెత్తుతూ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో మహమ్మద్ సిరాజ్ క్యాచ్ పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

భారత జట్టు ప్లేయర్ అయిన శుభ్ మన్ గిల్ తొలిరోజు గ్రౌండ్లో డాన్స్ చేశాడు.వెస్టిండీస్ జట్టు( West Indies ) 63 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసిన సమయంలో ఒక్కసారిగా బౌండరీకి బయటి వైపు నుండి వస్తున్న మ్యూజిక్ కు స్టెప్పులు వేశాడు.కోహ్లీ కాసేపు అలాగే గిల్ డాన్స్ చూస్తూ ఉండిపోయాడు.
మొత్తానికి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్లు అద్భుత ఆట ప్రదర్శన చేశారు.
తొలిరోజు ఆట ముగిసేసరికి భారత జట్టు 23 ఓవర్లకు 80 పరుగులు జోడించి, ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా నిలిచింది.







