శుభలేఖ సుధాకర్..
ఈ పేరును సరికొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సినిమా ఇండస్ట్రీలో యువకుడిగా ఉన్నప్పుడే అడుగు పెట్టి, హీరోగా, కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో నటించి ఇప్పటికీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు శుభలేఖ సుధాకర్.
శుభలేఖ అనే సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న సుధాకర్ కి ఎస్పీ బాలసుబ్రమణ్యం( S P Balasubrahmanyam ) చెల్లెలు అయిన శైలజ ను ఇచ్చి వివాహం చేశారు.చాలా మంది వీరిది లవ్ మ్యారేజ్ అనుకుంటారు.
కానీ వీరిది పెద్దలు కుదిరిచిన వివాహమే.ఈ జంటకు ఒక కుమారుడు కూడా ఉన్నారు.
శైలజ సింగర్ ( Singer sailaja )గా సినిమా పరిశ్రమలోనే కొనసాగుతున్న విషయం కూడా మన అందరికీ తెలుసు.
సాధారణంగా ఉన్నది ఉన్నట్టుగా, కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం లో శుభలేఖ సుధాకర్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారు.ఆయన ప్రస్తుతం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక వ్యక్తిగత మరియు సినిమా జీవిత విశేషాలను పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా నటించినందుకు గాను తాను పెద్దగా ఏమీ సంపాదించలేదని, తన జీవితంలో ఉన్నవి కేవలం రెండే రెండు ప్రాపర్టీస్ అంటూ చెప్పుకచ్చారు.
అది ఒకటి చెన్నైలో తనకు గల సొంత ఇల్లు అని, మరొకటి తన భార్య శైలజ అని నవ్వుతూ చెప్పడం విశేషం.
అవసరానికి డబ్బు కావాలి కానీ అవసరానికి మించి డబ్బు ఉంటె అదొక జబ్బుగా మారుతుంది అంటారు శుభలేఖ సుధాకర్.( Shubaleka sudhakar ) కానీ రేపటి కోసం డబ్బు దాచుకోక పోతే ఏదైనా సమస్య వచ్చిన రోజు అప్పు చేసే అవసరం వస్తుందని, అది అన్నిటికన్నా కూడా పెద్ద జబ్బు అంటారు ఎస్పీ శైలజ, ఇలా ఆస్తుల విషయంలో ఇద్దరి భిన్న కోణాలు కావడం విశేషం.అయినా కూడా పూర్తి జీవితం ఎంతో సంతోషంగా గడిపామని, తమకు ఉన్నదాంట్లో హాయిగానే ఉన్నామని చెప్పుకస్తారు ఇద్దరు.
ఈ జంట ఇలాగే నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని కోరుకుందాం
.