మామూలుగా పెళ్లి గురించి ఎక్కువగా ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు బాగా ఎదురవుతూ ఉంటాయి.ఎందుకంటే వాళ్ళు లేటు వయసులో కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు కాబట్టి.
కొంతమంది నటీనటులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి, పిల్లలు అని కానిస్తూ ఉంటారు.కానీ మరి కొంతమంది అలా కాదు.
వాళ్ళు రిలేషన్ లో ఉండి కూడా పెళ్లి చేసుకోవడానికి మరింత ఆలస్యం చేస్తూ ఉంటారు.ఇక కొందరు అయితే పెళ్లి చేసుకుంటే తమ సినిమా లైఫ్ ఆగిపోతుందేమో అన్న కారణంతో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటారు.
అయితే ఈ పెళ్లి కాకుండా ఉన్న నటీనటులకు మాత్రం పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని నిత్యం ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి.అయితే కొందరు మాత్రం మనసులో ఉన్న మాటలు చెప్పేస్తుంటారు.
మరి కొంతమంది చెప్పకుండా తప్పించుకుంటారు.అయితే తాజాగా ఓ బ్యూటీ రిలేషన్ ఉన్నా కూడా పెళ్లి గురించి అడగటంతో ఏకంగా షాకింగ్ సమాధానం ఇచ్చింది.
ఇంతకు ఆమె ఎవరో కాదు శృతిహాసన్.
భారత నటుడు కమల్ హాసన్ గారాల కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు నటనతో మంచి గుర్తింపు అందుకున్న శృతిహాసన్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.నటిగానే కాకుండా సింగర్ గా కూడా తనలో ఉన్న మరో యాంగిల్ ను బయట పెట్టింది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.
ఈమె 2000 లో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.2010లో ‘లక్’ అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయమయ్యింది.ఇక అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
అలా దాదాపు 20 సినిమాలలో నటించింది.తెలుగుతో, హిందీ తో పాటు తమిళ భాషలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక తానే స్వయంగా పాటలు రాసి కంపోజ్ చేస్తుంది కూడా.బాలీవుడ్ లో కూడా తన పాటను వినిపించింది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించింది.ఇక వ్యక్తిగత విషయంలో శృతి హాసన్ చాలాసార్లు వార్తల్లోకెక్కింది.అయినా కూడా తాను అవన్నీ పట్టించుకోకుండా తన కెరీర్ పై దృష్టి పెట్టింది.ఇక శృతి హాసన్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శాంతా ను హజారికా తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.
నిజానికి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇద్దరు ఒకే ఇంట్లో ఉండటంతో అందరూ శృతిహాసన్ ను విమర్శించారు.
ఈ బ్యూటీ కి చాలాసార్లు తన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇప్పటికీ ఈమె బయట కనిపిస్తే చాలు పెళ్లెప్పుడు అంటూ అడుగుతూనే ఉంటారు.తాజాగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా.తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టింది.అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.అయితే ఓ నేటిజన్.పెళ్లెప్పుడు చేసుకుంటారు అని అడగటంతో.ఈ ప్రశ్న చాలా బోరింగ్ అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చింది.
అంటే ఈ ప్రశ్న ఇప్పటికి చాలాసార్లు విని విని బోర్ కొట్టేసింది అన్నట్లుగా సమాధానం ఇచ్చింది.దీని బట్టి చూస్తే ఇప్పట్లో ఆమెకు పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్లు అర్థమవుతుంది.